టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో కాజల్, పూజ హెగ్డే హీరోయిన్ లుగా నటించారు.ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే.విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ క్రమంలోనే ఎమోషన్స్ లో భాగంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.
సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆచార్య సినిమాలు కాజల్ పాత్ర గగురించి రామ్ చరణ్ పలు ఆసక్తికర వాఖ్యలు చేసాడు.
ఈ సినిమాను దేవాదాయ భూముల స్కామ్ నేపథ్యంలో సామజిక కోణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.ఈ సినిమా నుంచి మొదటగా విడుదల చేసిన లాహే లాహే సాంగ్‌లో కాజల్ హవా కనిపించింది.
అయితే ఉన్నట్టుండి అనూహ్యంగా చిత్ర ప్రమోషన్స్‌లో ఎక్కడా కూడా కాజల్ పేరే వినిచకపోవడంతో అభిమానులో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అంతేకాకుండా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తావన రాకపోవడంతో సినిమా లోనుంచి కాజల్ అగర్వాల్ నటించిన సీన్స్ ని డిలీట్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి.
దీంతో ఈ విషయంపై తాజాగా రామ్ చరణ్ స్పందించాడు.

ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న రామ్ చరణ్ కి.ఆచార్య సినిమాలో కాజల్ పాత్ర సంగతి ఏంటి? అసలు ట్రైలర్లో కాజల్ ఎందుకు కనిపించలేదు? ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.రామ్ చరణ్ ఆ విషయాలపై స్పందిస్తూ చెప్పిన సమాధానం ప్రేక్షకులను మరింత ఇరుకున పడేసింది.
నాన్నతో కాజల్ కు సంబంధించిన చిన్న చిన్న సన్నివేశాలను తీస్తున్నప్పుడు నేను ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను.

అదే విధంగా నేను కూడా ఇంతవరకు ఈ సినిమా ఫైనల్ ఎడిట్ చూడలేదు కాబట్టి ఆమె పాత్ర గురించి తనకి సరిగా సమాచారం తెలియదు అని రామ్ చరణ్ చెప్పాడు.రామ్ చరణ్ చెప్పిన మాటలతో కాజల్ అగర్వాల్ విషయంలో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరి ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలి అంటే ఇంకా నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.







