ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఎన్నో రికార్డులు చేరడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైంది.అయితే కొమురం భీమ్ పాత్రను క్లైమాక్స్ లో కూడా కొంతమేర పవర్ ఫుల్ గా చూపించి ఉంటే బాగుండేదని తారక్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదనలో కూడా అర్థం ఉందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం తీరాలంటే రాజమౌళి ఎన్టీఆర్ సోలో హీరోగా ఒక సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు.
మరో నాలుగైదేళ్ల తర్వాతైనా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.ఎన్టీఆర్, రాజమౌళి ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ఇద్దరికి స్టార్ స్టేటస్ రావడానికి కారణమయ్యాయి.
రాజమౌళి సైతం సరైన కథ కుదిరితే ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కించే విషయంలో ముందువరసలో ఉంటారు.మహేష్ సినిమా పూర్తైన తర్వాత రాజమౌళి సైతం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
మరి ఎన్టీఆర్ జక్కన్న కాంబోలో మరో సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాల్సి ఉంది.వరుస విజయాలతో రాజమౌళి ప్రస్తుతం బిజీ డైరెక్టర్ గా మారిపోయారు.
రాజమౌళి రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారు.

రాజమౌళితో సినిమాను నిర్మించాలని క్యూ కడుతున్న నిర్మాతల జాబితా కూడా అంతకంతకూ పెరుగుతోంది.రాజమౌళి స్థాయిలో క్రేజ్ ఉన్న మరో దర్శకుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో లేడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో కూడా రాజమౌళికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
రాజమౌళికి ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నా జక్కన్న మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీపైనే , ఇక్కడి హీరోలపైనే దృష్టి పెడుతున్నారు.







