తెల్ల జుట్టుతో తీవ్రంగా సతమతం అవుతున్నారా.? వైట్ హెయిర్‌ను కవర్ చేసుకునేందుకు తరచూ కలర్స్ వేసుకుంటున్నారా.? అయితే ఇకపై మీకా చింత అక్కర్లేదు.కేవలం ఒక్క దెబ్బతో సహజంగానే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగైదు గింజ తొలగించిన కుంకుడు కాయలు, గుప్పెడు ఎండబెట్టుకున్న కరివేపాకు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టి గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేటుల్ స్పూన్ల కాఫీ ఫౌడర్, రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడర్ మరియు మొదట మిక్సీ పట్టుకున్న కుంకుడు కాయ-కరివేపాకు పొడి వేసి బాగా కలుపుకోవాలి.
దీనిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించి.
ఆపై వాటర్‌ను స్ట్రైనర్ సాయంతో సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్‌లో నాలుగైదు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి తలస్నానం చేయాలి.ఇలా చేస్తే మీ తెల్ల జుట్టు తప్పకుండా నల్లగా మారుతుంది.కెమికల్స్‌తో నిండి ఉండే కలర్స్‌ను వాడే బదులు వారంలో కేవలం ఒకే ఒక్కసారి ఈ న్యాచురల్ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు నల్లగా మారడమే కాదు.
నల్లబడిన జుట్టు మళ్లీ మళ్లీ తెల్లగా మారకుండా కూడా ఉంటుంది.