ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ సీనియర్ హీరోలు గా ఉన్నా మెగాస్టార్ చిరంజీవి.నందమూరి బాలకృష్ణ మధ్య ఎన్నో దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ వద్ద పోటీ నడుస్తూనే ఉంది.
ఈ ఇద్దరు హీరోలు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడి రికార్డులు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇలా పోటీపడే వీరిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ వస్తే చూడాలని ఒకవైపు నందమూరి అభిమానులు మరోవైపు మెగా అభిమానులు కూడా ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నారు.
కానీ వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా మొదలయిందని కానీ ఆ తర్వాత అనుకోని కారణాలతో సినిమా షూటింగ్ ఆగిపోయింది అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకుడు రాఘవేంద్రరావు.
ఇక ఇదే దర్శకుడు కాంబినేషన్ లో చిరంజీవి బాలకృష్ణ హిట్ సినిమాలను కూడా చేశారు.ఒకానొక సమయంలో చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ చేయాలని సన్నాహాలు చేశారట రాఘవేంద్రరావు.
ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన కథను రెడీ చేసి ఈ ఇద్దరు హీరోలు కూడా వినిపించాడట.కథ నచ్చడంతో ఇద్దరు హీరోలు కూడా మల్టీస్టారర్ చేసేందుకు ఓకే చెప్పారట.

ఇక అటు సినిమా షూటింగ్ ఓపెనింగ్ షాట్ చేయాల్సిన సమయం కూడా రానే వచ్చేసింది.మల్టీ స్టార్ కావడంతో ఇద్దరు హీరోలు ఒకే డ్రస్సు లో ముహూర్తం షాట్ కు విచ్చేశారు.కార్యక్రమం పూర్తయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి తప్పుకుంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారూ.ఇక ఈ విషయం తెలిసిన బాలకృష్ణ వెనకడుగు వేయకుండా ఈ సినిమాలో రెండు పాత్రలను నేనే చేస్తాను అంటూ చెప్పాడట.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం గా ఈ సినిమా తెరకెక్కింది.ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారు కదా. అపూర్వ సోదరులు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో సెన్సేషన్ సృష్టించింది.ఈ వార్త తెలిసి ప్రస్తుతం ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.







