ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఏ అవకాశం దొరికిన దానిపై సెటర్స్ వేయడాన్నికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నారు.ఇలాంటి విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నారు.
రాజకీయం ఎలాగైనా చేయవచ్చు అని నిరూపిస్తాడు చంద్రబాబు .ఇప్పడు రాష్ట్రంలో ప్రస్తతం జరుగుతున్న విద్యార్థినులు,యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతుండటం చంద్రబాబు రాజకీయ హీట్ పెంచాడు.
అయితే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన నన్నెంతో కలిచివేసింది.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యం.నిత్యం రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వాస్పత్రిలోని ఒక రూమ్‌లో దివ్యాంగురాలికి 30 గంటలపాటు ముగ్గురు మృగాళ్లు మద్యం తాగి నరకం చూపించడం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉందో అర్ధమవుతోంది.మహిళా భద్రతను వదిలేసి అధికార పార్టీ సేవలో పోలీసులు తరించడం దేనికి సంకేతం? అని టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలో ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దురాగతాలు గుండెను పిండేస్తున్నాయి.విజయవాడలో బాధితురాలిని మేము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చింది.ప్రజాగ్రహం చూసి భయపడి ఆదరాబాదరగా హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఘటనాస్థలానికి వచ్చారు.అత్యాచారం ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది.

రాష్ట్రంలో అసాంఘిక శక్తులు హద్దు మీరిపోతున్నాయి.గంజాయి, డ్రగ్స్ , మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయి.ప్రభుత్వ అసమర్థ చర్యలతో రాష్ట్రం రావణకాష్టంలా మారింది.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పాలనా వైఫల్యం నేరస్థులకు మద్దతుగా నిలుస్తున్నట్టున్నాయి.దిశ చట్టం ఆర్భాటపు ప్రచారానికే పరిమితమైంది.దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్దానం ఏమైంది? రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంతమందిని శిక్షించారు?అనే ప్రశ్నలకు నేటికీ మీ నుంచి సమాధానం లేదు.మహిళలపై నేరాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు.నేటికీ ఆ దిశగా చర్యల్లేవు.మహిళలకు రక్షణ కల్పించలేని మీకు పాలన చేసే అర్హత ఎక్కడుంది? అధికార వైసీపీ నేతలే కాలకేయుల అవతారమెత్తి ఆడవారిపై దాడులకు తెగబడుతున్నారుని టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలో ధ్వజమెత్తారు.
ఇకనైనా మహిళా భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించి, శాంతిభద్రతలు కాపాడండి.
రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించండి.విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలి.
కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, శాశ్వత నివాసం, జీవనోపాధి కల్పించాలి.ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసును వెంటనే పరిష్కరించి దోషులను కఠినంగా శిక్షించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్‌ను డిమాండ్ చేశారు