టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన నటన, డాన్స్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇప్పటికీ చిరంజీవి యువ హీరోలతో పోటీగా డాన్స్ చేస్తూ మరింత అభిమానులను సంపాదించుకున్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి మరొక హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సుమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సుమన్ నటనపరంగా కమల్ హాసన్ అంటే ఇష్టమని తెలిపిన సుమన్, మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ డాన్స్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో నేల వైపు చూడకుండా డాన్స్ చేసే ఒకే ఒక హీరో చిరంజీవి మాత్రమేనని సుమన్ వెల్లడించారు.
ఆయన డాన్స్ చేస్తే ఆయన బాడీలో ఒక రిథమ్, గ్రేస్ ఉంటుందని సుమన్ తెలిపారు.ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు కూడా డాన్స్ ఫాస్ట్ గా చేస్తున్నారు.
వాటిలో డాన్స్ కంటే కూడా జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నారు.

ఇక చిరంజీవి తర్వాత అంత అద్భుతంగా డాన్స్ చేసే హీరోల విషయానికి వస్తే ఎన్టీఆర్ డాన్స్ తనకు బాగా నచ్చుతుందని ఆయన డ్యాన్స్ చేసినా కూడా తన డాన్స్ లో ఒక రిథమ్ ఉంటుందని సుమన్ ఎన్టీఆర్ డాన్స్ గురించి వెల్లడించారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమన్ ఇండస్ట్రీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







