రాజకీయాల్లోకి రావాలంటే డబ్బుండాలి, అంగ బలం ఉండాలి, కులాల లెక్కలు, కుళ్ళు కుతంత్రాలు ఇలా ఎన్నో సమాకరణాలు ఉండాలి, అవసరమైతే కళ్ళు పట్టుకుని కుదరక పొతే ఆపై జుట్టు పట్టుకునే టాలెంట్ అయిన ఉండాలి.ఇది ప్రస్తుతం రాజకీయాలపై యువతకు ఉన్న భావన.
ఇందులో వాస్తవం ఎంత అనేది మీకే తెలుసు అయితే ఇవేం లేకపోయినా ప్రజల మదిలో ఉండే వారికి, మంచి చేసే గుణం, పేద ప్రజల కోసం ఏదన్నా చేయాలనే తపన ఉన్న ఎంతో మంది రాజకీయ నాయకులుగా ఎదిగి చరిత్రలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయితే విద్యార్ధి దశ నుంచీ రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే మంత్రి పదవి చేపట్టిన వారు మాత్రం అసలు లేరనే చెప్పాలి.
తాజాగా దేశం కాని దేశంలో ఏపీ విద్యార్ధి త్వరలో ఈ ఘనతను సాధించబోతున్నాడు.
ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరు కి చెందిన దివి తనూజ్ చౌదరి కుటుంభం పదేళ్ళ క్రితమే ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.
తనూజ్ తండ్రి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు.వాషింగ్టన్ డీసీలో ఉంటున్న తనూజ్ కుటుంభం ముందు నుంచీ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, తమకు తోచిన సాయం అందించడంతో ఈ అలవాటు వారి కుమారుడు తనూజ్ చౌదరికి కూడా అలవాటు అయ్యింది.
దాంతో తనూజ్ చౌదరి సేవా కార్యక్రమాలు, కల్చరర్ యాక్టివిటీస్ ను నిర్వహించడంలో ఎప్పుడూ ముందుండేవాడు.ప్రస్తుతం.
తనూష్ చౌదరి వన్ ప్లస్ చదువుతున్నారు.సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో రంగాలలో అత్యుత్తమ ప్రతిభకనబరుస్తున్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం అతడి సేవలను, విశిష్ట ప్రతిభను గుర్తించి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీ పదవిని అప్పగించింది.
అంతేకాదు అన్నీ కలిసొస్తే ఎమ్మెల్సీ నుంచీ ఆస్ట్రేలియా ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కనుందట.అదే జరిగితే అతి పిన్న వయసులో మంత్రి అవ్వనున్న వ్యక్తిగా తనూష్ చౌదరి రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.
.






