ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో సందడి చేయనున్న శ్రీదేవి, శోభన్ బాబు!

సంతోష్ శోభన్‌ హీరోగా గౌరీ హీరోయిన్ గా తెరకెక్కిన శ్రీదేవి శోభన్ బాబు సినిమా మా విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం అనూహ్యంగా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక స్టేజిపై జరగబోతుంది.

 Sridevi Shobhan Babu Movie Trailer In Acharya Pre Release Event , Acharya Pre Re-TeluguStop.com

ఈ సినిమా ను గోల్డ్ బాక్స్ బ్యానర్ లో చిరంజీవి కూతురు సుష్మిత నిర్మించిన ఈ నేపథ్యం లో ట్రైలర్ను ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక స్టేజిపై నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది.కూతురు నిర్మించిన సినిమా అవ్వడం వల్ల తన సినిమా వేడుకలో ఆమె సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పాడు.

చిరంజీవి మరియు రామ్ చరణ్ చేతుల మీదుగా శ్రీదేవి శోభన్ బాబు సినిమా ట్రైలర్ లాంచ్ జరగబోతుంది.ఇలా ఒక సినిమా వేడుకలో మరో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.

కేవలం చిరంజీవి వల్లే మొదటి సారి ఇలా జరుగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ తలచుకుంటే ఏదైనా చేయగలరు.

ఏం చేసినా కూడా వర్కవుట్ చేయగలరు.ఇప్పుడు తన సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం లో శ్రీదేవి శోభన్ బాబు సినిమా కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయడం ద్వారా ఆ చిన్న సినిమా ని పెద్ద సినిమా చేసిన ఘనత మెగాస్టార్ చిరంజీవి కి దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చిరంజీవి పెద్ద కూతురు నిర్మాణం లో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి.ఈ సినిమా తో సంతోష్ శోభన్‌ మరోసారి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడు అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మధ్య కాలం లో గౌరీ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి.జాను సినిమాల్లో నటించి మెప్పించింది.

ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడు ప్రేక్షకులతో మమేకమవుతూ అందరినీ ఆకట్టుకుంటుంది.అందుకే ఈ సినిమా తప్పకుండా ఆమెకు సక్సెస్ను తెచ్చిపెడుతుందని నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఆచార్య సినిమా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం ద్వారా మరింతగా ఈ సినిమాకు గుర్తింపు వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube