ఆర్ఆర్‌ఆర్‌ కి 'కేజీఎఫ్‌ 2' చేసిన డ్యామేజీ ఎంతో తేలిపోయింది

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రెండు వారాలు భారీ వసూళ్లను దక్కించుకున్న విషయం తెలిసిందే.మూడవ వారానికి వసూళ్లు కాస్త నెమ్మదించినా కూడా కచ్చితంగా మరో రెండు మూడు వారాల పాటు మంచి వసూళ్లు సాధిస్తుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేశారు.

 Kgf 2 Movie Damage To Rajamouli Rrr Movie , Kgf 2 , Rrr Movie, Rajamouli, Coll-TeluguStop.com

కానీ ఎప్పుడైతే కే జి ఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందో జక్కన్న సినిమా పూర్తిగా డౌన్‌ అయినట్లుగా అనిపించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కేజిఎఫ్ సినిమా సందడి కనిపించింది.

ఇక అమెరికా లో కూడా కేజీఎఫ్ సినిమా ముందు రాజమౌళి సినిమా కనిపించకుండా పోయింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినీ విశ్లేషకులు మరియు ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కే జి ఎఫ్ 2 సినిమా కారణంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా దాదాపుగా 80 నుంచి 100 కోట్ల వరకు నష్టపోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా సినిమాకు మధ్య రెండు వారాల గ్యాప్ ఉంటే సరిపోతుంది కానీ రాజమౌళి భారీ సినిమా కాబట్టి ఆయన సినిమా కు కనీసం నెల రోజుల గ్యాప్ ఉంటే మంచిది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.కేజిఎఫ్ నెల రోజుల గ్యాప్ లో కాకుండా ముందే రావడం వల్ల భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Kgf, Prashanth Neel, Rajamouli, Ramcharan, Yash-

ఈ విషయమై ఆర్ ఆర్ ఆర్ అభిమానులు కే జి ఎఫ్ టీం పై పెద్దగా స్పందించేందుకు నిరాకరించారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఇప్పటికే 1200 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.కనుక కేజిఎఫ్ 2 వల్ల ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ చిన్న మొత్తం నష్టం వల్ల కే జి ఎఫ్ సినిమా ను తిట్టాల్సిన అవసరం లేదు అని మరి కొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి నష్టం అయితే జరిగిందని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube