గోధుమ‌ల ఉత్ప‌త్తిలో భార‌త్ ఎక్క‌డ ఉందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

గోధుమల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.గోధుమ‌ల ఉత్పత్తి పరంగా రష్యా, అమెరికా, కెనడాల సంఖ్య మన తర్వాతే వస్తుంది.

 Domestic Demand Of Wheat In India Production Per Capita Availability Details, Wh-TeluguStop.com

మ‌న‌దేశం ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారుగా పేరొందింది.ఏప్రిల్ 2021 నుండి జనవరి-2022 వరకు, $ 1742 మిలియన్ విలువైన గోధుమలు మ‌న దేశం నుండి ఎగుమతి అయ్యాయి.2020-21లో ఏప్రిల్ నుండి జనవరి వరకు కేవలం 358 మిలియన్ డాలర్ల విలువైన గోధుమలు ఎగుమతి అయ్యాయి.రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఈ ఏడాది గోధుమల ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.

భారతీయ రైతులు దీని నుంచి ప్రయోజనం పొందే అవ‌కాశం ఉంది.అటువంటి పరిస్థితిలో భారతదేశంలో గోధుమలకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం భారతదేశ దేశీయ గోధుమ డిమాండ్ దాదాపు 94.45 మిలియన్ టన్నులు. 2021-22లో దేశంలో 111.32 మిలియన్ టన్నుల గోధుమలు ఉన్నట్లు అంచనా.అదేవిధంగా, 2021-22 సంవత్సరంలో భారతదేశంలో బియ్యం ఉత్పత్తి 127.93 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు.

బియ్యం డిమాండ్ 107 మిలియన్ టన్నులు.నేడు మనం గోధుమలు, బియ్యం విషయంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.గోధుమ మన ప్రధాన పంట.వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, 1951లో ఒక వ్యక్తికి సంవత్సరానికి 24 కిలోల గోధుమలు మాత్రమే అందుబాటులో ఉండేవి.ఇప్పుడు 2020 నాటికి అది 65 కిలోలుగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube