మహేష్ బాబుకి స్పెషల్ థాంక్స్ చెప్పిన రామ్ చరణ్..ట్వీట్ వైరల్!

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత వరుస భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇప్పటికే ఈ ఏడాది పవన్ భీమ్లా నాయక్, RRR, కేజీఫ్ వంటి చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి.

 Ram Charan Says Special Thanks To Mahesh Babu Tweet Goes Viral, Ram Charan, Mahe-TeluguStop.com

ఈ క్రమంలోనే మరి కొద్ది రోజులలో మరొక భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక రెండు రోజుల నుంచి ఈ సినిమా కోసం మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ అధికారకంగా ఆచార్య సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసారు.ఈ క్రమంలోనే చిరంజీవి బాటలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆచార్య సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ విషయం గురించి రామ్ చరణ్ స్పందిస్తూ మహేష్ బాబుకి స్పెషల్ థాంక్స్ తెలియచేశారు.ఈ సందర్భంగా మహేష్ బాబుకు థాంక్స్ చెబుతూ మీరు ఆచార్య సినిమాని నాకు మరెంతో స్పెషల్ గా మార్చారు.మీ వాయిస్ ఓవర్ లో బిగ్ స్క్రీన్ పై ఆచార్య సినిమాను ఆడియోస్ ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను అంటూ రామ్ చరణ్ మహేష్ బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube