వైరల్: రూ.10 నోటుపై ప్రేమలేఖ...!

ప్రేమ అనేది ఎంత గొప్పదో మనందరికీ తెలుసు.ఈ ప్రేమలో పడితే ఎంతటి వారు అయినా ఆ ప్రేమకు దాసులు అవ్వాల్సిందే.

 Viral Love Letter On Rs 10 Note , Viral , 10rs Note, Love Story, Viral Latest, V-TeluguStop.com

ప్రేమకు వయసు, కులం, మతం అనే తేడా ఉండదని కవులు చక్కగా వర్ణించి మరి చెబుతారు.మరి ఇలాంటి ప్రేమను వ్యక్తపరచాలంటే ఎలా? ఒకప్పుడు ప్రేమలేఖ రాసి పావురాల ద్వారా చేరవేసేవాళ్ళు.తర్వాత గాజు సీసాలో ప్రేమ లేఖను పెట్టి వ్యక్తపరిచేవారు.ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్ లోనే మొత్తం ప్రేమలు నడుస్తున్నాయి.కానీ ఓ అమ్మాయి మాత్రం తను ప్రేమించిన వ్యక్తికి రూ.10 నోటుపై లేఖ రాసింది.తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, తనను వచ్చి తీసుకెళ్లిపోమని తన ప్రియుడికి లేఖ రాసింది ఓ అమ్మాయి.ఆ నోటు ప్రేమలేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇలా కరెన్సీ నోటుపై ప్రేమలేఖలు రాయడం కొత్తేమి కాదు.ఇంతకుముందు కూడా ఇలా ఎన్నో నోట్లపై ప్రేమలేఖలను మనం చూసాం.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ సందేశంతో ఒక నోటు ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దానిపై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి.

ఇప్పుడు ఈ నోటు కూడా అలాగే ఫేమస్ అవుతుంది.ప్రస్తుతం ట్విటర్‌లో ఈ నోటు ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఈ నోటులో… ‘విశాల్.నా పెళ్లి 26న జరగనుంది.అప్పటిలోపు నన్ను తీసుకెళ్లిపో.ఐ లవ్యూ.నీ కుసుమ్.‘ అంటూ రాసుంది.ఇక దీనిపై సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్, జోక్స్ మొదలయిపోయాయి.

ఈ నోటును ట్విట్టర్ లో ఓ వ్యక్తి షేర్ చేస్తూ… ‘ట్విటర్ నీ పవర్ చూపించు.26 ఏప్రిల్ లోపు కుసుమ్ రాసిన ఈ లేఖ విశాల్‌కు చేరుకోవాలి.ఇద్దరు ప్రేమికులను కలపాలి.

మీకు తెలిసిన విశాల్‌ను ట్యాగ్ చేయండి’ అని ట్వీట్ చేశాడు.దీనిపై పలువురు స్పందిస్తున్నారు.

కొందరు తమకు తెలిసిన విశాల్ అనే పేరున్న వారిని ట్యాగ్ చేస్తూ ఆటపట్టిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube