మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టైసన్ 1987-1990 వరకు తిరుగులేని వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా రాణించాడు.
ప్రత్యర్థులను నిమిషాల్లోనే మట్టి కరిపించి మోస్ట్ పవర్‌ఫుల్ బాక్సర్ గా ఎదిగాడు.అయితే ఇప్పటికీ అతను వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
ఇటీవల ఓ తెలుగు సినిమాలో కూడా నటించి ఆశ్చర్యపరిచాడు.అయితే తాజాగా అతను ఒక వివాదంలో చిక్కుకు పోయాడు.
ఈ బాక్సర్ తోటి ప్రయాణికుడిపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.బుధవారం రోజున శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడాకు బయలుదేరిన ఒక ఫ్లైట్ లో మైక్ టైసన్ ఎక్కాడు.
అయితే అతన్ని చూడగానే తోటి ప్రయాణికుడు బాగా ఎగ్జైట్ అయ్యాడు.మైక్ టైసన్ అంటూ అతని వెనక సీటు వద్దకు వెళ్లి విసిగించాడు.“ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్” అని గట్టిగా అరుస్తూ టైసన్ ని రెచ్చగొట్టాడు.అంతేకాదు, ఒక వాటర్ బాటిల్ కూడా టైసన్ పై విసిరాడు.
దీంతో అప్పటివరకు ఓపిక పట్టిన టైసన్ ఆ తర్వాత తన ఉగ్రరూపాన్ని చూపాడు.తన సీట్ లో నుంచి లేచి వెనక సీట్ లో ఉన్న సదరు ప్రయాణికుడిపై పంచుల వర్షం కురిపించాడు.
ఇదంతా జరుగుతున్నప్పుడు అదే ఫైట్ లోని మరొక ప్రయాణికుడు వీడియో తీశాడు.

వీడియో తీసిన వ్యక్తి టైసన్ ని కొట్టడం ఆపేయాలని విజ్ఞప్తి చేశాడు.టైసన్ పంచులకు తోటి ప్రయాణికుడు బాగా గాయపడ్డాడు.అతడి ముఖం నుంచి రక్తస్రావం అయ్యింది.
ఈ సంఘటన జరిగిన వెంటనే టైసన్ ఫ్లైట్ దిగి వెళ్లిపోయాడని సమాచారం.అయితే ఈ ఘటనలో వీడియో తీస్తున్న వ్యక్తి కూడా టైసన్ ని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.
వీరిద్దరిని పోలీసులు నిర్బంధించినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
దీనిపై నెటిజన్లు రకరకాల స్పందిస్తున్నారు.చాలామంది తోటి ప్రయాణికుడీదే తప్పు అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







