స్విమ్మింగ్ పూల్ లో సాగరకన్యలా మారిపోయిన రష్మిక.. వీడియో వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక గురించి అందరికీ సుపరిచితమే.ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందారు.

 Rashmika Turned Into Sagarakanya In The Swimming Pool Video Goes Viral , Rashmik-TeluguStop.com

ఇలా పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంలో నటించిన రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది.ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలకు కమిట్ అయిన ఈమె మరొక సినిమా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా తెలుగు తమిళ హిందీ భాషలలో వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా రష్మిక నటిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాలో ఆలియా భట్ నటిస్తుందనే వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా నుంచి అలియా తప్పుకోవడంతో ఆ అవకాశం రష్మిక అందుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Telugu Bollywood, Nationalcrush, Puspa, Rashmika, Pool, Tollywood-Movie

ఈ విధంగా రష్మిక వరుస పాన్ ఇండియా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకొని రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.ఇదిలా ఉండగా తాజాగా రష్మిక స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ సాగరకన్యల మారిపోయారు.

స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఈతకొడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube