బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ప్రియాంక చోప్రా రామ్ చరణ్ తో కలిసి తెలుగులో కూడా ఒక సినిమాలో నటించారు.
ప్రియాంక చోప్రా 2018లో తన ప్రియుడు నిక్ జోనాస్ నీ వివాహమాడింది.వీరి వివాహ సమయంలో నిక్ జోనస్ వయసు గురించి అనేక వార్తలు వచ్చాయి.
ఎందుకంటే నిక్ ప్రియాంక కన్న 10 సంవత్సరాలు చిన్నవాడు.అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ తో ప్రియాంక చోప్రా కొంత కాలం డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకుంది.
వివాహబంధంతో ఒక్కటైన వీరిద్దరూ అప్పటినుండి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.అయితే వీరిద్దరు 2022 జనవరి 15వ తేదీన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు.సరోగసీ పద్ధతి ద్వారా ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట అప్పటినుండి తమ కూతురు పేరు బయటకు తెలియకుండా రహస్యంగా ఉంచారు.తాజాగా చిన్నారి పేరు బయటకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారి బర్త్ సర్టిఫికెట్ లో తన పేరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్ అని ఉంది.

అయితే ప్రియాంక ,నిక్ తమ కూతురికి” మాల్టీ మేరీ” అని పేరు పెట్టడం వెనుక చాలా ప్రత్యేకత ఉందని సమాచారం.సంస్కృతం ప్రకారం “మాల్టి ” అంటే “చంద్ర కాంతి” లేదా “చిన్న పరిమళ సువాసన కలిగిన పుష్పం ” అని అర్థం.లాటిన్ స్టెల్లా మారిస్ ప్రాకారం ” మేరీ అంటే ఒక సముద్రపు నక్షత్రం” .తమ అభిమాన హీరోయిన్ కూతురికి ఇంత మంచి అర్థం వచ్చే పేరు పెట్టడంతో అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







