మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అమితమైన ఉంటే దేశంతో పాటు విదేశాలకు వెళ్లాలని కలలు గంటుంటారు.విదేశాలను సందర్శించాలనుకునేవారు పర్యటనకు ఏ ప్రదేశం ఉత్తమమైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అప్పుడే మీరు అందమైన దృశ్యాలను చూడటంతోపాటు అసౌకర్యాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.అందుకే ఆ అందమైన ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ కనిపించే అద్భుతమైన దృశ్యాలు మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాయి.ఇంగ్లండ్ మీరు మొదటిసారి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే, ఇంగ్లాండ్ ఉత్తమ గమ్యస్థానంగా ఉంటుంది.
మీరు ఇక్కడ అన్వేషించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి.మీరు ఇంగ్లాండ్ రాజధానితో మీ పర్యటనను ప్రారంభించవచ్చు.
బార్సిలోనా అందమైన భవనాలు, వాస్తుశిల్పంతో కూడిన బార్సిలోనాలో ఆర్ట్ మ్యూజియంలు కూడా కనువిందు చేస్తాయి.అలాగే రుచికరమైన వంటకాలు కూడా ఇక్కడి అందుబాటులో ఉంటాయి.
ఈ పర్యాటక ప్రదేశం ఎప్పుడూ పర్యాటక ఆకర్షణకు కేంద్రంగా ఉంటుంది.ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక అనుకూలమైన ప్రదేశం.
ఇక్కడ అత్యుత్తమ రవాణాతో పాటు, షాపింగ్చ గొప్ప బీచ్‌లు కూడా ఉన్నాయి.బార్సిలోనా ఎల్లప్పుడూ పర్యాటకుల జాబితాలో ఉంటుంది.

జపాన్
మీరు విదేశాలకు వెళ్లాలని అనుకుంటే అందుకు జపాన్ ఉత్తమ ప్రదేశం.జపాన్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, పరిశుభ్రమైన, ప్రణాళికాబద్ధమైన దేశం.దీనిని పర్యాటకులు అమితంగా ఇష్టపడతారు.జపాన్ ప్రయాణం భారతీయులకు పెద్దగా భారం కాదు.
టర్కీ

మొదటిసారి విదేశీయులకు వెళ్లాలనుకునేవారికి టర్కీ ఒక అద్భుతమైన ప్రదేశం.ఇక్కడ అనేక ప్రకృతి సోయగాలు కనిపిస్తాయి.అదే సమయంలో శతాబ్దాల నాటి నాగరికత ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.ఇది ఈ దేశంలో చెక్కుచెదరకుండా ఉంది.ఇవి పర్యాటకులకు ఎంతగానో నచ్చుతాయి.దీనితో పాటు బీచ్‌లో నల్లరాళ్లు ఎంతో అందంగా కనిపిస్తాయి.
మీరు టర్కీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఆహారం మొదలుకొని నైట్ లైఫ్‌ను ఆస్వాదించవచ్చు.







