ప్రెసెంట్ టాలీవుడ్ లో ఆచార్య మ్యానియా నడుస్తుంది.చిరంజీవి, రామ్ చరణ్ కలిసి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య.
ఈ సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంది.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.
చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
వీరిద్దరూ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేయాలనీ మేకర్స్ నిర్ణయించారు.
దీంతో వరుసగా ఈ సినిమా నుండి అప్డేట్ లు ఉండేలా చూసుకుంటున్నారు.

ఇటీవలే ట్రైలర్ తో పాటు భలే భలే బంజారా సాంగ్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ రెండు అప్డేట్ లు కూడా మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి.ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాకు మహేష్ బాబు మాట సహాయం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.మహేష్ చిరు కుటుంబంతో ఎప్పుడు సన్నిహితంగా ఉంటాడు.

చరణ్, మహేష్ బాబు అయితే సమయం వచ్చినప్పుడు ఒకరిపై ప్రేమను మరొకరు బయట పెడతారు.మరి ఈ క్రమంలోనే తాజాగా ఆచార్య సినిమాకు మహేష్ బాబు తనవంతు సహాయం చేస్తున్నట్టుగా టాక్.ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని కొరటాల మహేష్ ను అడుగగా ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.మరో రెండు మూడు రోజుల్లో మహేష్ ఈ వాయిస్ ఓవర్ ను పూర్తి చేయనున్నాడట.
ఈ వార్త ఇప్పుడు ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయడంలో సాయ పడింది.కొరటాల మహేష్ కాంబోలో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు వచ్చాయి.రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఈ చనువుతోనే కొరటాల మహేష్ ను ఈ సాయం కోరారట.







