మెగాస్టార్ వల్ల కన్నీళ్లు పెట్టిన రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు తనయుడు రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.

 Ram- Charan Emotional Comments Chiranjeevi Ram Charan, Emotional Comments, Chira-TeluguStop.com

ఇక రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా, చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది.ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నరు.ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిట్ చాట్ లో పాల్గొన్న రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ సెట్ లో తన తండ్రితో కలిసి నటించిన అనుభవాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను నటించడమే కాకుండా సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ప్రతి నిమిషం కూడా తాను తన తండ్రితో కలిసి ఉండటం అనేది తనకు బాగోద్వేగపూరితమైనది అని తెలిపాడు రామ్ చరణ్.అంతేకాకుండా తన తండ్రిలి తనకు వీలుగా ఉండే విధంగా ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇచ్చారని, ఆ ఇంట్లో దాదాపుగా 20 రోజులు ఉన్నాము అని తెలిపాడు.

ఆ ఇరవై రోజుల పాటు తాను తన తండ్రి కలిసి ఉదయాన్నే లేచి వర్కవుట్ చేసి,తిని ఆ తరువాత షూటింగ్ కు వెళ్లే వాళ్లం అని చెప్పుకొచ్చాడు చరణ్.

Telugu Acharya, Chiranjeevi, Kajal Agrawal, Pooja Hegdhe, Ram Charan, Tollywood-

రోజు కలిసి షూటింగ్ కు వెళ్లడమే కాకుండా అక్కడ ఇద్దరు సెట్ లో కలిసి పని చేసే వాళ్ళం అని తెలిపాడు చెర్రీ.షూటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు తిరిగి ఒకే కారులో వచ్చేవాళ్ళం అని తెలిపాడు.అయితే తన తండ్రి తో గడిపిన క్షణాలు అన్ని కూడా తనకు ఎంతో మధురమైన అని చెప్పుకొచ్చాడు చెర్రీ.

అయితే ఒకరోజు చిరంజీవి రామ్ చరణ్ తో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడట.చరణ్ దీని వ్యాల్యూ నీకు అర్థం కావడం లేదేమో.ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశాలు రావు.కానీ ఆచార్య సినిమా వల్ల మనకు ఇలాంటి మంచి అవకాశం వచ్చింది.

షూటింగ్ కి ముందు తర్వాత ఇలా ప్రతి ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేద్దాం.అంతేకాకుండా ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారి మనకు కుదరదు అని చరణ్ ను చిరంజీవి హత్తుకోవడం తో చరణ్ ఎమోషనల్ అయ్యాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube