కేజీఎఫ్ 2 చూస్తూ థియేటర్లో కాల్పులు.. ఒక్కసారిగా రచ్చ మొదలు!

సాధారణంగా థియేటర్ లలో అభిమాన హీరో హీరోయిన్ ల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అభిమానులు ఏ రేంజ్ లో హంగామా చేస్తారో మనందరికి తెలిసిందే.థియేటర్ లో ఈలలు, కేకలు అరుపులతో రచ్చ రచ్చ చేస్తుంటారు.

 Gun Shot Leg During Kgf 2 Screening Shiggaon Theatre, Kgf 2, Karnataka, Kgf Cine-TeluguStop.com

ఈ క్రమంలోనే థియేటర్ లలో బయట చిన్న చిన్న గొడవలు లాంటివి జరుగుతు ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు పెద్దగా మారి కొట్టుకోవడం, చంపుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

కేజిఎఫ్ సినిమా చూస్తుండగా థియేటర్లలో కాల్పులు జరిగాయి.దీనితో థియేటర్ల లోని జనాలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు.

అసలేం జరిగిందంటే కర్ణాటకలోని హవేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.వసంత్ కుమార్ అనే వ్యక్తి సెకండ్ షో చూస్తున్నాడు.

తెరపై కేజిఎఫ్ 2సినిమా నడుస్తోంది.ఈ క్రమంలోనే వసంత కుమార్ కాలు వెళ్లి ముందు కుర్చీలో ఉన్న వ్యక్తికి తగలడంతో, వారిద్దరి మధ్య గొడవ మొదలైంది.

Telugu Haveri, Karnataka, Kgf, Leg, Shiggawi-Movie

దీంతో సదరు వ్యక్తి బయటికి వెళ్లి పిస్టల్ తీసుకొని వచ్చి అతనిపై ఏకంగా మూడుసార్లు కాల్పులు జరపగా 2 తూటాలు వసంత కాలు, అలాగే కడుపు భాగంలో కి దూసుకెళ్లాయి.అయితే హీరో విలన్ ల మధ్య జరుగుతున్న కాల్పులు కళ్ళముందే జరగడంతో ప్రేక్షకులు భయంతో థియేటర్ బయటకు పరుగులు తీశారు.ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అప్పటివరకు సినిమాలు చూస్తూ బాగానే ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్లలో కాల్పులు జరగడంతో భయంతో బయటకు పరుగులు తీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube