ఆ ఇంటర్వ్యూ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్‌.. ఇంకా ఎపుడు?

మెగా స్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆచార్య.ఈ సినిమా లో రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

 Fans Waiting For Acharya Chiranjeevi And Ram Charan Promotional Interview , Ach-TeluguStop.com

రికార్డ్‌ బ్రేకింగ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడింది.సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్‌ వీడియో లు మరియు పాటలు సినిమా పై అంచనాలు ఆకాశానికి తాకేలా చేశాయి అనడంలో సందేహం లేదు.

హీరో లుగా చిరంజీవి మరియు చరణ్ కలిసి నటించడం వల్ల ఆచార్య సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడం లో సందేహం లేదు.మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే సినిమా పై అంచనాలు పెంచేలా చేశాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్‌ స్వింగ్ లో మొదలు అవ్వడం లేదు.సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్స్ మరియు ఇంటర్వ్యూల కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా కొరటాల శివ మరియు రామ్‌ చరణ్‌ ల ఇంటర్వ్యూ ను విడుదల చేయడం జరిగింది.

ఇంటర్వ్యూ ల సందడి మొదలు అయిన నేపథ్యం లో చరణ్ మరియు చిరంజీవి యొక్క ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

సినిమా లో ఇద్దరు కలిసి నటించారు.అయితే తండ్రి కొడుకులుగా కాదు.తండ్రి కొడుకులుగా ఇంటర్వ్యూలో కనిపిస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఆరాట పడుతున్నారు.తెలుగు ప్రేక్షకులు అదుగో ఇదుగో అంటూ వెయిట్‌ చేసిన ఆచార్య సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అయ్యింది.

మరి ఇంటర్వ్యూ కూడా ఒకటి రెండు రోజుల్లో వస్తుందేమో చూడాలి.ఇద్దరు కలిసి ఎన్నో ముచ్చట్లు చెప్తారు… అలాగే పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధంను చెప్తారు అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రీ రిలీజ్ వేడుక లో పవన్‌ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube