టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పుట్టినరోజు కార్యక్రమాలను టిడిపి నేతలు నిర్వహిస్తున్నారు.దీని కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి తన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ, ఆ పార్టీ నాయకులు రకరకాల ప్రసంగాలు చేస్తూ.బాబు ని పొగడ్తలతో ముంచెత్తారు.
అయితే విజయవాడ పార్టీ కీలక నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన బుద్ధ వెంకన్న మాత్రం బాబు అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా నిరంతరం చంద్రబాబును తిట్టి పోస్తూ ఉండే వైసీపీ నాయకులను ఉద్దేశించి ఆయన ఘాటుగానే హెచ్చరికలు చేశారు. చంద్రబాబు పై చెత్త వాగుడు వాగితే వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని, వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశామని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు అంటూ బుద్ధ వెంకన్న కామెంట్ చేశారు.బాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని, చంపడానికి అయినా చావడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు.
బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రతి మనిషిలోనూ కృతజ్ఞత అనేది ఉండాలని, చంద్రబాబు తమకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు కటౌట్ కు పంచామృతాలతో పాలాభిషేకం చేయడమే కాకుండా, 500 మందికి చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఈ రెండు సంవత్సరాల్లో చంద్రబాబు కుటుంబం పై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని.బాబును తిడితే టిడిపి కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయని భావిస్తున్నారని, ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా వెంకన్న హెచ్చరికలు చేశారు.ఇదే సమావేశంలో ఆ పార్టీ నేత నాగుల్ మీరా కూడా పాల్గొన్నారు.
అయితే చంద్రబాబు కోసం సూసైడ్ బ్యాచ్ సిద్ధం చేశామని వెంకన్న చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ దుమారం రేపుతున్నాయి.







