నయనతార, సమంత తెలుగు, దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే అగ్ర కథానాయకులుగా గుర్తింపు పొందారు.లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించిన వీరిద్దరు ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ” కాతు వాకుల రెండు కాదల్” అనే సినిమాలో విజయ్ సేతుపతితో కలసి ప్రధాన పాత్రలలో నటించారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈనెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ చూసిన తర్వాత నయనతార ఎమోషనల్ అవుతూ సమంతని గట్టిగా హత్తుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోని ‘కణ్మణి, ఖతిజ’ అనే క్యాప్షన్ తో ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే పేరుతో ట్విట్టర్ వేదిక షేర్ చేశారు.
అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు మళ్లీ ఆ వీడియోని రీ ట్వీట్ చేస్తున్నారు.ఇక డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ ,నయనతార గతకొన్ని సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

విగ్నేష్ శివన్ ‘ లవ్ యూ ‘ అని మీనింగ్ వచ్చేలా సింబల్స్ పెట్టి మరి ఈ వీడియోని రీ ట్వీట్ చేశారు.ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కించిన ఈ సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందించారు.ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం నయనతార ఎమోషనల్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







