స్వాతిముత్యం షూటింగ్ సమయంలో దర్శకుడు నాపై కోప్పడ్డారు.. రాధిక షాకింగ్ కామెంట్స్!

ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమం మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.ఈ కార్యక్రమంలో అలీ ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.

 Director Fire Me During Swatimuthyam Movie Shooting Radhika Shocking Comments, R-TeluguStop.com

వారి పర్సనల్ విషయాల గురించి కూడా అడుగుతూ ఉంటాడు.ఇటీవల ఈ కార్యక్రమానికి అలనాటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గెస్ట్ గా వచ్చారు.

చిలిపి వయసు అనే సినిమా ద్వారా రాధిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన రాధిక తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరి సరసన నటించింది.

కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాధిక రవితేజ హీరోగా నటించిన ” రాజా ది గ్రేట్” సినిమాతో మళ్లీ సినిమాలలో అడుగుపెట్టింది.

ఇటీవల శర్వానంద్ హీరోగా నటించిన ” ఆడావాళ్ళు మీకు జోహార్లు” అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది.రాధిక ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా సుహాసిని గురించి మాట్లాడుతూ తాను నటించిన కొన్ని సినిమాలకు సుహాసిని కెమెరా అసిస్టెంట్ గా పని చేసిందని చెప్పుకొచ్చారు.అయితే సుహాసిని హీరోయిన్ అయిన తర్వాత తనను చూస్తూ నటించడానికి ఇబ్బంది పడేదని ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Radhika, Swatimuthyam, Telugu, Tollywood-Movie

రాధిక మాట్లాడుతూ న్యాయం కావాలి సినిమా షూటింగ్ లో భాగంగా చిరంజీవి గారిని చెంప దెబ్బ కొట్టిన సంగతి గురించి కూడా గుర్తు చేసుకున్నారు.ఆ సినిమా తర్వాత కొంతకాలం ఇద్దరి మధ్య మాటలు లేవని ,అభిలాష సినిమా చేసే సమయంలో కూడా ఇద్దరి మధ్య మాటలు లేవని ఆవిడ చెప్పుకొచ్చారు.స్వాతిముత్యం సినిమాలో ఒక పాటకు ఎక్స్ప్రెషన్స్ సరిగా ఇవ్వలేదని కె విశ్వనాథ్ గారు తనపై కోప్పడ్డారని రాధిక చెప్పుకొచ్చింది.ఈ విధంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో భాగంగా రాధిక తన సినీ కెరీర్ లో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube