అగ్ర రాజ్యం అమెరికా అయినా, బ్రిటన్ , సింగపూర్, ఇలా ఏ దేశమైనా సరే భారతీయ విద్యార్ధులు తమ దేశాలలో చదువుకోవాలని, వారిని తమవైపు ఆకర్షించాలనుకుంటారు.ఈ క్రమంలోనే వారిని తమవైపు తిప్పుకునేందుకు ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉంటారు.
అయితే మెజారిటీ విద్యార్ధులు మాత్రం అమెరికా వెళ్లి చదువుకోవడానికే అధిక ప్రాధాన్యతను ఇస్తారు.కానీ కరోనా కారణంగా గడిచిన ఏడాదిన్నరగా అమెరికా వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్ధుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
దాంతో బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, వంటి దేశాలు భారతీయ విద్యార్ధులను ఆకర్షించే పనిలో పడ్డాయి.పైగా.
అమెరికాకు వెళ్ళే విద్యార్ధి వీసా స్లాట్ల కోసం రెండేళ్ళ పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండటంతో ఇతర దేశాలు ఇస్తున్న ఆఫర్ల కారణంగా ఆయా దేశాలు వెళ్తున్నారు.అంతేకాదు బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు విద్యార్ధులు చదువు అయిపోయిన తరువాత ఉద్యోగ కోసం తమ దేశంలో ఉండే సమయాన్ని కూడా పెంచింది.
అంతేకాదు శాశ్వత నివాసం కోసం ఏళ్ళ తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది…దాంతో ఈ పరిస్థితిని గమనించిన అమెరికా.
భారతీయ విద్యార్ధులు చే జారిపోకుండా తగు చర్యలు చేపడుతోంది.
తాజా నిర్ణయం ప్రకారం అమెరికా విద్యార్ధి వీసా స్లాట్ల సంఖ్యను భారీగా పెంచింది.ఇదే సమయంలో స్లాట్ల కోసం వేచి ఉండే పరిస్థితిని గణనీయంగా తగ్గించింది.
ఏపీ, తెలంగాణా, ఓడిసా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు వీసా స్లాట్ల కోసం ఏళ్ళ తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితిను దృష్టిలో పెట్టుకున్న అమెరికా విద్యార్దులల్లో నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ వీసా స్లాట్ల సంఖ్యను భారీగా పెంచేసింది.దాంతో గతంలో స్లాట్ల కోసం వేచి ఉండాల్సిన సమయం 911 రోజుల నుంచీ ఒక్కసారిగా 68 రోజులకు తగ్గిపోయింది.
అయితే పర్యాటక వీసాలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది.







