అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసుల వేధింపులు తాళలేక బలవర్మరణం పొందిన ఖమ్మం నగర వాసి, బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య కు పాల్పడిన విషయాన్ని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.విషయం పూర్తిగా తెలుసుకున్న అమిత్ షా, సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రి తో ఫోన్ లో మాట్లాడారు.
అధైర్యపడవద్దని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఆత్మహత్య కు కారకులైన వారిపై పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదన్న విషయాన్ని బీజేపీ నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం తో మాట్లాడి సీబీఐ ఎంక్వైరీ కి డిమాండ్ చేసి, సమగ్ర విచారణ జరిపించి,కారకులకు పై చర్యలు తీసునేలా చూస్తానన్నారు







