కరోనా వింత మనిషి ..చూస్తే షాక్ అవుతారు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా చాలా మందిని బలితీసుకుంది.ప్రజలను గజగజలాడిచింది.

 Brazil Man Michael Faro Bizarre Body Modification Viral Details, Brazil Man, Mic-TeluguStop.com

ఆర్థికంగా కరోనా దెబ్బతో డౌన్ అయ్యారు.ఇప్పటికి కొలుకోలేని పరిస్థితి.

మళ్ళీ కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు మాస్కుల, సామజిక దూరం పాటించండి అని అంటూ చెబుతున్నారు.అయితే బ్రెజిల్ లోని ప్రైయా గ్రాండేకి చెందిన వ్యక్తి విన్నూత రీతిలో ఆలోచన చేశాడు.అతనిది విచిత్రమైన మైండ్ సెట్ అనిపిస్తోందా? అయితే మీ ఆలోచన వంద శాతం రైట్.ఎందుకంటే… విచిత్రంగా ఉండటమే అతనికి ఇష్టం.

పేరు మైకెల్ ఫారో. మన లాంటి మనిషే కానీ రాక్షసుడిలా కనిపిస్తాడు.అతన్ని ప్రజలు సైతాన్ అని పిలుస్తారు.ఆ పేరుతో ఫేమస్ అయ్యాడు.

కొన్ని దేశాల్లో ఇప్పుడు మాస్క్ తప్పనిసరి కాదు.బ్రెజిల్‌లో ఉంటున్న తాను మాస్క్ ధరించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో… తన చెవులకు సర్జరీ చేయించుకున్నాడు.

ఇప్పుడు అతనికి చెవులు లేవు.ఈ కరోనా వచ్చాక ప్రపంచంలో 99 శాతం మంది మాస్కులు వాడారు.

మాస్కులు ధరించాలంటే చెవులు ఉండాలి కదా.ఆ చెవులకు మాస్కులను వేలాడదీసుకుంటున్నాం.కరోనా కేసులు తగ్గాయి కాబట్టి… ఇక మాస్కులతో అవసరం లేదు అని భావించిన అతను… చెవులతో పనేముంది అని భావించి… వాటిని తీయించేసుకున్నాడు.

అతని నిర్ణయం, ఆకారం రెండూ భయంకరంగానే ఉన్నాయి కదా.చెవులను తీయించేసుకున్నాక ఏం చేశాడో తెలుసా వాటినీ, మాస్కులనూ పక్కపక్కన పెట్టి ఫొటోలు తీసి…

Telugu Bizarre, Brazil, Corona, Fingers Ears, Diablo, Lypo, Michael Faro, Sathan

సోషల్ మీడియాలో షేర్ చేశాడు.బ్రెజిల్ లోని ప్రైయా గ్రాండేకి చెందిన ఇతను… తన బాడీలో చాలా మార్పులు చేయించుకున్నాడు.తలపై కొమ్ములు ఉన్నట్లుగా డిజైన్ చేయించుకున్నాడు.కళ్లతో సహా బాడీలో చాలా పార్టుల్ని రకరకాలుగా మార్పించుకున్నాడు.మైకెల్‌ని డయాబ్లో అనే నిక్‌నేమ్‌తో కూడా పిలుస్తారు.అంటే దెయ్యం అని అర్థం.

అతని భార్య కూడా అలాంటిదే.ఇద్దరూ తమ బాడీలను కుదురుగా ఉంచుకోవట్లేదు.

ఎప్పుడూ ఏదో ఒక సర్జరీ చేయించుకుంటూనే ఉంటారు.దెయ్యంలా కనిపించడానికి మైకెల్… ఇప్పటివరకు 60 సార్లు ఆపరేషన్లు చేయించుకున్నాడు.

తన శరీరంపై 85 శాతం ఇంక్ వేయించుకొని టాటూల లాగా చేయించుకున్నాడు.ఇప్పటికీ సంతృప్తి లేదు.

ఇంకా ఏదో మార్పు జరగాలన్నదే ఆలోచన.

Telugu Bizarre, Brazil, Corona, Fingers Ears, Diablo, Lypo, Michael Faro, Sathan

ఒళ్లంతా టాటూలూ, పార్టులకు చీలికలు, దంతాలకు మార్పులు… ఇలా ఏ పార్టునూ ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు మైకెల్.చెవులు తీయించుకోవడమే ఆశ్చర్యం అనుకోవద్దు.ఇదివరకు తలపై కొమ్ములు వచ్చేలా చేసుకున్నాక… ఉంగరపు వేలు అక్కర్లేదనిపించి తీయించేసుకున్నాడు.

అంతేనా ముక్కును కోయించుకున్నాడు.పొట్ట వస్తే ఎక్సర్‌సైజులు చేసి తగ్గించుకోవడం అందరూ చేసేపని.

మైకెల్ మాత్రం… లైపోసక్షన్ చేయించుకొని దాన్లోని కొవ్వు మొత్తం తీయించేసుకున్నాడు.చెవులు తీయించేసుకోవడాన్ని గొప్పగా ఫీలవుతున్నాడు.

మాస్క్ తప్పనిసరి అనే నిబంధన ఎప్పుడు ఎత్తేస్తారా అని ఇన్నాళ్లూ ఎదురు చూశాడట.ఇప్పుడు ఆ ఛాన్స్ రావడంతో… పండుగలా ఫీలవుతున్నాడట.

ఇలా అవసరం లేదని అన్నీ తీయించుకుంటూ పోతే ఇక బాడీలో మిగిలేది ఏమీ ఉండదు అంటున్నారు నెటిజన్లు.అతను మాత్రం తన గురించి ప్రపంచం ఇలా మాట్లాడుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube