బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కంటెస్టెంట్ ల జీవితాలు విధంగా ఉంటాయి అన్నది చెప్పడం చాలా కష్టం.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్ లు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకొని కెరీర్ పరంగా బిజీబిజీగా మారారు.
ఇంకొందరు కంటెస్టెంట్ లు మాత్రం బిగ్ బాస్ హౌస్ ద్వారా బోలెడంత నెగిటివ్ మూటకట్టుకోవడంతో పాటు అవకాశాలను కూడా అందుకోలేక పోతున్నారు.ఇంకొందరు కంటెస్టెంట్ లు మాత్రం బిగ్ బాస్ క్రేజ్ ను తెగ వాడేసుకుంటున్నారు.
అలాంటి వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కూడా ఒకరు.
సోహెల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించు కున్నాడు.
ఇకపోతే ప్రస్తుతం సోహెల్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే మూడు నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.
తాజాగా సోషల్ తన పుట్టినరోజు సందర్భంగా మరొక సినిమాకు కూడా ఇచ్చాడు.అమ్ము క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పనా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎస్ వి కృష్ణారెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తొలి సినిమాకు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో వరుణ్ సందేశ్, సునీల్ లాంటివారు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.అదే విధంగా టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రారంభోత్సవ సమయంలో సునీల్, వరుణ్ సందేశ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వరుణ్ సందేశ్ నటించిన కొత్త బంగారు లోకం సినిమాలో ఏదో ఒక మూలన కనిపిస్తాడు.అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఏకంగా సోహెల్ హీరోగా నటిస్తున్నాడు.అలాంటి సోహెల్ హీరోగా చేస్తున్నా సినిమాలో వరుణ్ సందేశ్ ఒక చిన్న పాత్రలో నటించబోతున్నాడు.ఇదే విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు.







