చేతిలో చెయ్యి వేసి ప్రేమించుకుంటున్న విగ్నేష్, నయనతార.. ఇన్స్టా స్టోరీ వైరల్!

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటి నటి నయనతార గురించి అందరికీ పరిచయమే.తను నటించే సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోసినట్లు గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

 Vignesh And Nayantara Fall In Love Insta Story Goes Viral, Vignesh, Nayantra, Ko-TeluguStop.com

తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో పై స్థాయిలో ఉంది.ఎన్నో చిత్రాలలో లేడి ఓరియెంటెడ్ పాత్రలలో నటించి గొప్ప టైటిల్ ను సొంతం చేసుకుంది.

2003 లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తను.2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది.ఇదిలా ఉంటే తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొన్నేళ్ల నుంచి ఈ భామ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ జంట.

ఇక విగ్నేష్ శివన్ కు ముందు తను మరో హీరో ప్రభుదేవాతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్న తాను మరో డైరెక్టర్ శింబూతో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.కాగా కొన్ని రోజుల తర్వాత తాను నటించిన ఓ సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.ప్రస్తుతం ఆయన ప్రేమలో మునుగుతున్న నయన సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలను తెగ పంచుకుంటుంది.

Telugu Kollywood, Nayantra, Vignesh-Movie

అంతేకాకుండా సినిమా షూటింగ్ లో వారిద్దరు కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటారు.కానీ విచిత్రం ఏంటంటే నయన కంటే విఘ్నేష్ వయసులో చిన్న వాడు.అయినా వీటిని పట్టించుకోకుండా నయనతార తన ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.ఇక గతంలో వీరి పెళ్లి ముహూర్తాలు తేదీలు కూడా ప్రకటించగా.అవి కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి.

ఇక విగ్నేష్ కూడా తన సోషల్ మీడియా వేదికగా నయనతార తో దిగిన ఫోటోలు బాగా పంచుకుంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా విగ్నేష్ శివన్ మరోసారి తన ఇన్ స్టా లో మరో పోస్ట్ షేర్ చేసుకున్నాడు.అందులో తను తన గర్ల్ ఫ్రెండ్ నయనతారతో కలిసి ఉండగా.

వారిద్దరి చేతిలో చెయ్యేసుకుని ప్రేమించుకుంటున్నట్లుగా కనిపించారు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా.

ఆ వీడియోను చూసిన తన అభిమానులు, నెటి జన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Telugu Kollywood, Nayantra, Vignesh-Movie

ఇదిలా ఉంటే నయనతార తన ప్రేమికుడి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాథువాకుల రెండ్ కాదల్‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇందులో సమంత కూడా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అంతేకాకుండా రజినీకాంత్ సరసన మరో సినిమాలో నటిస్తుండగా.మలయాళం మరో సినిమా లో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube