టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి సురేఖ వాణి గురించి అందరికీ సుపరిచితమే.ఈమె ఎన్నో సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.
సురేఖ వాణి మరొక నటుడు రాజా రవీంద్రకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నటి సురేఖ వాణితో కలిసి రాజా రవీంద్ర కూడా ఎన్నో సినిమాలలో చేశారు.వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ నిత్యం బర్త్డే పార్టీలు, ఫంక్షన్లు, వీకెండ్ పార్టీలంటూ స్నేహితులు అందరితో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 18 నటుడు రాజా రవీంద్ర పుట్టినరోజు కావడంతో సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.హ్యాపీ బర్త్ డే టు మై డియరెస్ట్ ఫ్రెండ్.
నా శ్రేయోభిలాషి రాజారవీంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు.గాడ్ బ్లెస్ యు మై డియర్ అంటూ నటుడు రాజా రవీంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

ఇక రాజారవీంద్ర కూడా ఎన్నో సినిమాలలో పలు కీలక పాత్రలో నటించడమే కాకుండా ఎంతో మంది టాలీవుడ్ హీరోలకు మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉండేవారు.ఇక తాజాగా రాజారవీంద్ర శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.అలాగే యూట్యూబ్ వీడియోస్ ద్వారా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్రెండ్ అవుతున్నారు.







