ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు తమ రెమ్యునరేషన్ ను అంతకంతకూ పెంచేస్తున్నారు.ఇక అగ్ర హీరోలతో సినిమాలు అంటే వారి పారితోషికానికే సగం సినిమా బడ్జెట్ అయిపోతుంది అన్న వార్తలు కూడా చాలానే విన్నాం.
అంతే కాకుండా మూవీ హిట్ అయితే వచ్చే లాభాల్లోనూ కొంత శాతం అడుగుతున్నారు మరి కొందరు హీరోలు.ఒక నిర్మాత ఇచ్చిన బడ్జెట్ లో దర్శకుడు సినిమాని రూపొందించాల్సి ఉంటుంది.
అలాంటప్పుడు ఆ బడ్జెట్ లో హీరోలకే ఎక్కువగా కేటాయించాల్సి వస్తే ఇక సినిమా చిత్రీకరణకు ఏమి మిగులుతుంది.అందుకే ఉన్నంతలో క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు చాలా మంది దర్శకులు.
కానీ వీటికి భిన్నంగా క్వాలిటీ నెంబర్ వన్ గా మన ముందుకు దూసుకు వచ్చిన సంచలనాత్మక చిత్రం కేజీఎఫ్.
ఈ సినిమా చిత్రీకరణ ఎంత క్వాలిటీగా ఉందో విడుదలయ్యాక రెస్పాన్స్ అంతకన్నా సాలిడ్ గా మారింది.
ఈ సినిమా దెబ్బకి ఇతర ఇండస్ట్రీలు, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కంగు తింది.అక్కడి సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కేజీఎఫ్ చాప్టర్ 2 దండయాత్ర చేసి భారీ కలెక్షన్స్ ను సాధించి శాండిల్ వుడ్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసింది.రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఇదే స్థాయిలో ప్రభావం చూపింది ఈ చిత్రం.
అయితే ఇందుకు మేజర్ కారణం సినిమా క్వాలిటీనే అంటున్నారు బాక్సాఫీస్ పండిట్స్.హీరో యశ్ తక్కువ పారితోషికాన్ని తీసుకోవడం, మిగిలిన నటీ నటులు కూడా తక్కువ గానే రెమ్యునరేషన్ తీసుకోవడంతో మిగిలిన బడ్జెట్ అంతా సినిమాను ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించడానికే వెచ్చించారని అందుకే ఈ స్థాయిలో ఔట్పుట్ వచ్చిందని అంటున్నారు.

నిజానికి ఒక సినిమా భారీ సక్సెస్ అందుకుంటే చాలా మంది హీరోలు తదుపరి ప్రాజెక్టులకు చాలా భారీగా పారితోషికాన్ని పెంచేస్తారు.అయితే ఇందుకు హీరో యశ్ మినహాయింపు అని చెబుతున్నారు.కేజీఎఫ్ చాప్టర్ 1 సంచలన విజయాన్ని అందుకున్నప్పటికీ చాప్టర్ 2 కోసం కేవలం 30 కోట్ల పారితోషికాన్ని మాత్రమే తీసుకున్నారు అని అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ 15 కోట్లు తీసుడుకున్నాడట, విలక్షణ నటుడు సంజయ్ దత్ 9 కోట్లు తీసుకున్నారు అని మిగిలిన నటీనటులు తక్కువగానే పారితోషికాలు తీసుకున్నారని కాగా కేజీఎఫ్ చాప్టర్2 స్టార్స్ సాలరీస్ టోటల్ బడ్జెట్ లో 20% శాతానికి మించలేదని గణాంకాలు చెబుతున్నాయి.

కాబట్టే ఎక్కువ మొత్తాన్ని సినిమా రూపొందించడానికి కేటాయించడంతో ఈ స్థాయిలో రిజల్ట్ వచ్చిందని అంటున్నారు.అయితే మిగిలిన పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఈ లెక్కలు వేరేగా ఉంటాయి.బడ్జెట్ లో 40% నుండి 50% వరకు స్టార్స్ రేమ్యునరేషన్ కే సరిపోతుంది, అంతెందుకు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అయితే బడ్జెట్ లో 40% వరకు హీరోల సాలరీలకే అయిపోయింది.100 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్న హీరోలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు.మరి ప్రొడక్ట్ కే జి ఎఫ్ చాప్టర్ 2 రేంజ్ లో రిచ్ గా రావాలి అంటే రాఖీబాయ్లా అగ్ర హీరోలు పెద్ద మనసు చేసుకోవాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.







