ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు డార్లింగ్ ప్రభాస్.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఉంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించ బోతున్నారు.నాగ్ అశ్విన్ చేసింది రెండే సినిమాలు అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
రెండు సినిమాల తోనే ఏకంగా డార్లింగ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు.సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి 10 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనె నటిస్తుంది.ఇంకా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ షెడ్యూల్ లో దీపికా పదుకొనే కూడా పాల్గొనబోతున్నట్టు టాక్.ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించ నున్నారు మేకర్స్.ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ కు క్యూరియాసిటీ పెరుగు తుంది.తాజా సమాచారం ప్రకారం.ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సాంకేతికతను టీమ్ ఉపయోగిస్తుంది.
ఈ సినిమా DIY Arri Alexa టెక్నాలిజీని ఉపయోగించి చిత్రీకరిస్తున్నారని సమాచారం.ఆ అధునాతన సాంకేతికతను ఉపయోగించిన మొదటి సినిమా ఇదే.ఈ సాంకేతికత సినిమాటోగ్రఫీ కి సంబంధించినది.

ఇది సినిమాకు దృశ్యమాన అనుభవాన్ని మెరుగు పరుస్తుంది.ప్రాజెక్ట్ కే అనేది భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.ఫైట్స్, కాస్ట్యూమ్స్, భారీ సెట్స్ ఇలా ప్రతీది ఖరీదైనవే.
విజువల్ గ్రాఫిక్స్ మాయాజాలం పరంగానూ హాలీవుడ్ స్టాండర్డ్స్ ని అనుసరిస్తున్నారు.దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.







