రాజకీయంగా చిరంజీవి పవన్ ఎప్పటికీ కలవరా.. ఆ ప్రచారంతో టెన్షన్ లో ఫ్యాన్స్!

చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోగా అనుకూల ఫలితాలు రాలేదనే సంగతి తెలిసిందే.ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

 Ap Politics Megastar Chiranjeevi Big Shock To Power Star Pawan Kalyan Details, C-TeluguStop.com

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ హవా కొనసాగుతున్న తరుణంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి తప్పు చేశారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

తర్వాత కాలంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాలకు దూరమైన సంగతి తెలిసిందే.

అయితే 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.జనసేన పార్టీ 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారణమైంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సమయంలో టీడీపీకి ఓట్లు వేయడం ఆ పార్టీకి ప్లస్ అయింది.

అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీకి దూరం కావడంతో అటు టీడీపీ ఇటు జనసేన తీవ్రస్థాయిలో నష్టపోయాయి.

Telugu Achareya, Big Shock, Chiranjeevi, Cmjagan, Janasena, Brothers, Pawan Kaly

వైసీపీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా 151 అసెంబ్లీ స్థానాల్లో అధికారంలోకి వచ్చింది.అయితే జనసేనకు చిరంజీవి నుంచి డైరెక్ట్ గా ఎప్పుడూ మద్దతు లభించలేదనే సంగతి తెలిసిందే.చిరంజీవి న్యూట్రల్ గా ఉన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పెద్దగా ఇబ్బంది లేదు.

Telugu Achareya, Big Shock, Chiranjeevi, Cmjagan, Janasena, Brothers, Pawan Kaly

అయితే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సీఎం జగన్ హాజరవుతున్నారని జరుగుతున్న ప్రచారం పవన్ అభిమానులను టెన్షన్ పెడుతోంది.రాజకీయాల విషయంలో చిరంజీవి పవన్ దారులు వేర్వేరా? అని పవన్ ఫ్యాన్స్ సందేహపడుతున్నారు.జగన్ నిజంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైతే మాత్రం ఈ విషయాలకు సంబంధించి మరింత చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఒక విధంగా బిగ్ షాక్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube