ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.. ఎమ్మెల్యే సీతక్క

ప్రజా సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.రైతులను నట్టేట ముంచిన ముఖ్య మంత్రి కెసిఆర్.

 Mulugu Mla Seetakka Criticizes Trs Government Details, Mulugu Mla Seetakka ,trs-TeluguStop.com

నిరుపేదలకు డబుల్ బెడ్ రూం లు మంజూరు చేయాలి.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు ఆదరించాలి.

గ్రామ గ్రామాన కాంగ్రెస్ పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమం లో ములుగు మండలం బంజరు పల్లి గ్రామములో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.బంజారు పల్లి గ్రామము లో మహిళలతో సమావేశం అయిన సీతక్క.

ఈ రోజు ములుగు మండలం బంజరు పల్లి గ్రామం లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క .అనంతరం వివిధ పార్టీల నుండి మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క .

ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో అధికారం లోకి వచ్చిన కెసిఆర్ పేద ప్రజలకు చేసింది ఏమి లేదని ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దళితులకు మూడెకరాల భూమి అన్నాడు ఇవ్వాళే పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం కట్టిస్తా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.ఇంటోకో ఉద్యోగం ఇస్తాం పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య అందిస్తా అని ఇలా అనేక హామీలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేసిన కెసిఆర్ కు ప్రజలు బుద్ది చెప్పాలని తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు ఆదరించాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం అని సీతక్క అన్నారు.

అనంతరం గ్రామ ప్రజల తో సమావేశం అయిన సీతక్క గారికి గ్రామం లో ఉన్న ప్రధాన మైన సమస్యలను సీతక్క గారి దృష్టికి తీసుకు రాగా జిల్లా కలెక్టర్ గారితో ఫోన్ ద్వారా గ్రామంలో బిటి రోడ్డు మధ్యలోనే ఆగిన పరిస్థితి ముఖ్యంగా బాత్ రూం లు లేక ఇబ్బందులు పడుతున్నారు అని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళిన ఎమ్మెల్యే సీతక్క .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,ఫిషర్ మేన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,మాజీ సహకార సంఘం చైర్మన్ కుణురి అశోక్ గౌడ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు, ఫిషర్ మేన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమౌళి,సర్పంచ్ ఎండీ హైమా దు పాషా,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,గ్రామ కమిటీ అధ్యక్షులు కంచెం రఘు, సహకార సంఘం డైరెక్టర్ ఓ జ్జల రవి,మాజీ సర్పంచ్ బిట్ల కొమురయ్య,కర్నె రతన్వార్డు సభ్యులు భిక్ష పతి,మొగిలి ఎన్నిండ్ల ప్రదీప్,గ్రామ కమిటీ అధ్యక్షులు మాదసి శ్రీనివాస్, వార్డు సభ్యులు సది,మొగిలి గోల్కొండ సాంబయ్య,సంపత్ వినోద,అన్నపూర్ణ,నెంబర్ సాంబీ సమ్మయ్య,గంగాధర్,నాగయ్య నగేష్,మేడం రమణ కర్, పత్తి మొగిలి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube