ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రకృతి రెడ్డి పాడిన కొమ్మ ఉయ్యాలా పాట ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సాంగ్ వల్ల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి రెడ్డి పేరు మారుమ్రోగుతోంది.
ఈ పాట నుంచి వచ్చిన ప్రశంసల వల్ల తాను చాలా సంతోషిస్తున్నానని ప్రకృతి తెలిపారు.ఈ పాట పాడిన సమయంలో తనకు ఆర్ఆర్ఆర్ సినిమాకు పాడుతున్నానని తెలియదని పాట పాడిన నెలరోజుల తర్వాత ఆ విషయం తెలిసిందని ప్రకృతి అన్నారు.
కీరవాణి సార్ నాకు ఛాన్స్ ఇచ్చారని ప్రకృతి వెల్లడించారు.ఎస్వీబీసీ ఛానల్ లో అన్నమయ్య సాంగ్ పాడిన సమయంలో తన వాయిస్ విని కీరవాణి సార్ ఛాన్స్ ఇవ్వడం జరిగిందని ప్రకృతి అన్నారు.
కన్నడ, తమిళ్ భాషలలో కూడా కొమ్మ ఉయ్యాల సాంగ్ ను తాను పాడానని ప్రకృతి వెల్లడించారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి గారిని కలిశానని ఆ సమయంలో చాలా సంతోషంగా అనిపించిందని ఆయన ముందు పాడటం సంతోషంగా అనిపించిందని ప్రకృతి రెడ్డి పేర్కొన్నారు.
తాను బోల్ బేబీ బోల్ టైటిల్ విన్నర్ అని ప్రకృతి వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ మూవీలో కొమ్మ ఉయ్యాలా సాంగ్ కాకుండా కొమురం భీముడో సాంగ్ అంటే తనకు ఇష్టమని ప్రకృతి రెడ్డి అన్నారు.ఎన్టీఆర్, రామ్ చరణ్ లను చూశాను కానీ తాను కలవలేకపోయానని ప్రకృతి రెడ్డి చెప్పుకొచ్చారు.అమ్మకు జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే చాలా ఇష్టమని నాకు మాత్రం రామ్ చరణ్ సార్ అంటే పిచ్చి అని ప్రకృతి రెడ్డి చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ సినిమాను రెండుసార్లు చూశానని ఒకసారి బళ్లారిలో మరోసారి హైదరాబాద్ లో చూశానని ప్రకృతి రెడ్డి వెల్లడించారు.అమ్మమ్మకు కొమ్మ ఉయ్యాలా పాట బాగా నచ్చిందని ప్రకృతి తెలిపారు.కన్నడలో ప్రసారమయ్యే పలు సీరియళ్లకు తాను ప్లే బ్యాక్ సింగర్ గా పని చేశానని ప్రకృతి పేర్కొన్నారు.







