ఖమ్మం నగరంలో ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి, తన పై తప్పుడు కేసులు బనాయిస్తూ, ఉద్దేశపూర్వకంగా తనని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఖమ్మం నగరం 37 వ డివిజన్ కి చెందిన బీజేపీ పార్టీ కార్యకర్త సాయి గణేష్ నాలుగు రోజుల క్రితం ఖమ్మం నగరంలోని త్రి టౌన్ పోలీస్టేషన్ వద్ద పురుగు మందు త్రాగి ఆత్మహత్య యత్నం చేశాడు.హుటాహుటిన ఖమ్మం లో ఒక ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించారు, మెరుగైన వైద్యం కోసం నిన్న హైదరాబాద్ లోని ప్రవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు.
సాయి డెడ్ బాడీని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.ఘటన పై ఆగ్రహంతో ఉన్న బీజేపీ శ్రేణులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చూరీ వద్ద ధర్నా చేపట్టారు.
అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే పోలీసులు, సాయి గణేష్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సాయి గణేష్ బలవన్మరణం కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తు, సాయి గణేష్ కుటుంబ సభ్యులు కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కోనసాగిస్తున్నారు.







