కిలీపాల్ కంటెంట్ క్రియేటర్‌ గా దుమ్మురేపుతున్నాడు..

పుట్టిన ప్రతి మనిషిలో ఎదో ఒక కళ ఉంటుంది.ఈ సమేత అందిరికి తేలిసిందే.

 Tanzania Killi Paul Lip Sync Videos To Indian Songs Viral On Social Media Detail-TeluguStop.com

అయితే నిన్న విడుదలైన కేజీఎఫ్ సీనిమా మంచి రేట్టింగ్ వచ్చింది.ప్రతి ఒక హీరోకి వీర అభిమానులు ఉంటారు.

కానీ ఇప్పుడు నేను చేప్పబోయే కేజీఎఫ్ అభిమాని చూస్తూ వామ్మో ఇంత అభిమానంమా అని అంటారు మీరు .టాలెంట్ ఉన్నవారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు.వాళ్లను ఎక్కడికో తీసుకుపోతారు.అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలోని టాంజానియా దేశ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కిలీపాల్.స్వతహాగా డాన్సరైన కిలీపాల్… సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌ గా దుమ్మురేపుతున్నాడు.

ముఖ్యంగా భారతీయ సినిమాల్లోని పాటలు, సీన్లను లిప్ సింక్ ఇస్తున్నాడు.

అతని చెల్లి నీమా పాల్ కూడా అప్పుడప్పుడూ కిలీపాల్‌తో కలిసి లిప్ సింక్ ఇస్తూ ఉంటుంది.ఐతే ఆమె కంటే కిలీపాలే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.తాజాగా అతను సూటూ బూటూ ధరించి… కేజీఎఫ్ 2 సినిమాలో హీరో యష్ చెప్పిన వయలెన్స్ డైలాగ్‌కి చక్కగా లిప్ సింక్ ఇచ్చాడు.ఆఫ్రికాలోని పేద దేశాల్లో ఒకటి టాంజానియా.

అక్కడి ప్రజల్లో చాలా మంది వన్యమృగాల్ని వేటాడి తింటారు.పేదరికం వారికి వేరే ఆప్షన్ లేకుండా చేస్తోంది.

అలాంటి చోట పుట్టిన కిలీపాల్ కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు.అయినప్పటికీ… అతను తనలో టాలెంట్స్‌ని మెరుగుపరచుకుంటూ వచ్చాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో లిప్ సింక్ వీడియోలు చేస్తూ… ప్రపంచం తనవైపు చూసేలా చేశాడు.ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల సీన్లకు లిప్ సింక్, డాన్సులు చేస్తూ వైరల్ సెన్సేషన్ అయ్యాడు.

ఇదివరకు వీడియోల్లో సరైన షర్ట్ కూడా లేకుండా సంప్రదాయ మసాయ్ బట్టల్లో కనిపించిన కిలీపాల్… కేజీఎఫ్ 2 వీడియోలో మాత్రం సూట్ ధరించి కనిపించాడు.అదిరిపోయే ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఇచ్చాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లోని తన అకౌంట్ లో ఏప్రిల్ 15, 2022న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటివరకు లక్షల మంది చూడగా 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు.నెటిజన్లు అదిరిపోయే కామెంట్స్ ఇస్తున్నారు.కేజీఎఫ్ 3 టాంజానియా నుంచి” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా నీకు త్వరలోనే బాలీవుడ్ నుంచి కాల్ వస్తుంది.రాసిపెట్టుకో నా మాటల్ని అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

చూడటానికి చాలా హ్యాండ్సమ్‌గా వున్నావు అని మరో యూజర్ కామెంట్ ఇవ్వగా నిన్ను యాక్షన్‌లో చూడటం హ్యాపీగా ఉందని మరో యూజర్ స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube