బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో ప్రసారం అవుతున్న జాతిరత్నాలు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
జబర్దస్త్ తరహాలోనే జాతి రత్నాలు కామెడీ షో ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు.ఇకపోతే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి రష్మి, అనసూయకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే జాతిరత్నాలు కోసం కూడా శ్రీముఖి అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.జాతి రత్నాలు కోసం శ్రీముఖి కూడా అనసూయ రష్మీ తరహాలోనే పారితోషికం అందుకుంటుందా అనే విషయానికి వస్తే శ్రీముఖికి అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం శ్రీముఖికి జాతిరత్నాలు కోసం కేవలం ఒక్క షెడ్యూల్ కి ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు మాత్రమే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకానొక సమయంలో శ్రీముఖి ఒక్కో షో కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకునేది.అయితే ప్రస్తుతం ఆమెకు బుల్లితెరపై అవకాశాలు లేకపోవడంతో తన రెమ్యూనరేషన్ కూడా పూర్తిగా తగ్గిపోయిందని తెలుస్తోంది.ఈ విధంగా శ్రీముఖి తక్కువ రెమ్యూనరేషన్ తో కూడా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి గల కారణం తనకు ఎప్పటినుంచో మల్లెమాల వారితో కలిసి పని చేయాలన్న కుతూహలం ఉండటం వల్ల తక్కువ రెమ్యూనరేషన్ అయినప్పటికీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.







