ఈ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సత్తా చాటిన భారతీయుడు

ప్రతీ సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా యాపిల్ షాట్ ఆన్ ఐఫోన్ మాక్రో ఫొటోగ్రఫీ ఛాలెంజ్ పోటీలను ప్రారంభించింది.ఈ పోటీలో పలు దేశాలకు సంబంధించిన వారు పాల్గొనగా.

 Prajwal Chougule Wins Apple Iphone Challenge By Taking Dew Drops On Spider Web P-TeluguStop.com

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఇంజనీర్‌ కు ఈ రివార్డ్ దక్కింది.మొదటగా పోటీలను అనౌన్స్ చేసిన షాట్ ఆన్ ఐ ఫోన్.

జనవరి 2022 నుంచి షాట్ ఆన్ iPhone మాక్రో ఫోటోగ్రఫీ ఛాలెంజ్ కోసం ఎంట్రీలను ప్రారంభించింది.ఈ పోటీలో పాల్గొనే వాళ్లు 16 ఫిబ్రవరి 2022 వరకు తమ ఐఫోన్ నుంచి తీసిన ఫొటోలను పంపించాల్సి ఉంటుంది.

ఈ ఛాలెంజ్‌లో కొల్హాపూర్‌కు చెందిన ప్రజ్వల్ చౌగులే Apple ఐఫోన్ మాక్రో ఫోటోగ్రఫీ ఛాలెంజ్‌లోని షాట్‌లో మొదటి పది స్థానాల్లోకి ప్రవేశించగలిగాడు.మిగిలిన 9 స్థానాల్లో చైనా, హంగరీ, ఇటలీ, స్పెయిన్, థాయిలాండ్, అమెరికా వంటి ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.

పోటీలో మొదటి స్థానాల్లో నిలిచినా వారు తమ ఐ ఫోన్ లో తీసి పంపిన ఫోటోలను Apple తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తోంది.అంతేకాకుండా ఈ ఫోటోలను యాపిల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పలు నగరాలకు సంబంధించిన బిల్‌బోర్డ్‌లలో ప్రదర్శిస్తున్నారు.

Telugu Apple Iphone, Dewdrops, Indian, Kolhapur, Macro Graphy-Latest News - Telu

ఈ పోటీలో పాలొన్న వారు.వారు తీసే ఫోటోలలో ఐఫోన్ 13 ప్రో మాక్స్ మాక్రో కెమెరా సెన్సార్‌ను హైలైట్ చేయాలి.యాపిల్ ఈ ఛాలెంజ్‌లో, ఫోటోగ్రాఫర్‌లు ఐఫోన్ 13 ప్రో లేదా ఐఫోన్ 13 ప్రో మాక్రో లెన్స్‌తో ఫోటోలను క్లిక్ చేయాల్సి ఉంటుంది.ప్రజ్వల్ చౌగులే స్పైడర్ వెబ్‌లో మంచు బిందువులను తన ఐఫోన్ లో క్లిక్ చేసాడు.

ఉదయాన్నే ఈ మంచు బిందువులు ముత్యాల్లా కనిపించడంతో ఈ ఫోటోను పోటీలో పంపడానికి నిర్ణయించుకున్నానని అతను తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube