యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 అంచనాలను మించి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా కేజీఎఫ్2 సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు సినిమాలోని కొన్ని డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోశాయి.ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా మూవీలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సినిమాలో కొన్ని డైలాగ్స్ తూటాల్లా పేలాయనే చెప్పాలి.“ఇక్కడ తలలు శాశ్వతం కాదు.కిరీటాలే శాశ్వతం”, ” నెపోటిజం నెపోటిజం నెపోటిజం.మెరిట్ ను ఎదగనివ్వరా”, “చరిత్రలు, పురాణాలు చెబుతున్నాయి ఆడదానికి క్రోదం వస్తే చెయ్యి చేసుకోకూడదు అలంకరించి బొట్టు పెట్టి పూజ చేసి దండం పెట్టాలి”, “నాకీ చరిత్ర మీద నమ్మకం లేదు జరిగిందొకటి అయితే రాయించింది ఇంకొకటుంది వాళ్లు చెప్పింది వీళ్లు చెప్పింది విని రాయొద్దు కళ్లారా నువ్వే చూసి రాయి దానికో విలువుంటుంది”.
“రక్తంతో రాసిన కథ ఇది సిరాతో ముందుకు తీసుకెళ్లలేం.ముందుకు వెళ్లాలంటే మళ్లీ రక్తాన్ని కోరుతుంది”,

“దేశం అప్పు తీర్చాలా చెప్పేయండి తీర్చేస్తాను”, “మిమ్మల్ని మంచి చేయనివ్వరు.నన్ను మంచోడిని అవ్వనివ్వరు”, “నా కొడుకు శవాన్ని ఎవరూ మోయాల్సిన అవసరం లేదు.వాడి కాళ్లే వాడిని సమాధి దగ్గరకు తీసుకెళతాయి” మరికొన్ని డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఈ డైలాగ్స్ లో కొన్ని డైలాగ్స్ ను యశ్ రాస్తే మరికొన్ని డైలాగ్స్ ను ప్రశాంత్ నీల్ రాశారని సమాచారం.సినిమాలో తన నటనతో యశ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు.ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా కథను రాసుకున్నారు.కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాతో ప్రశాంత్ నీల్ ఖాతాలో మరో సక్సెస్ చేరిందనే చెప్పాలి.







