వామ్మో...‎ఈ పిల్లి అంత డెంజర్ నా..?

మీరు ఎప్పుడైనా పిల్లులను చూశారా.అదేంటి పిల్లులు చూడడం ఏంటి అని అనుకుంటున్నారా…అవును ‎ఈ పిల్లిని చూశాక అలా అనక తప్పలేదు.

 Is This Cat So Dangerous , Cat , Dangerous Cat , Animals , Birds , Fishing Cat-TeluguStop.com

ప్రపంచంలో ఎన్నో రకాల పిల్లులను చూశాం కానీ ఈ పిల్లికి ‎ఓ ప్రత్యేకత ఉంది.అరుదైన జంతువుల్ని కాపాడుకోవాలి.ఎందుకంటే… అవి అంతరిస్తే తిరిగి పుట్టించడం ప్రస్తుతానికి సాధ్యం కావట్లేదు.పూర్వం ఎన్నో రకాల జంతువులు, పక్షులు అంతరించిపోయాయి.

వాటిని ఇప్పటికీ తిరిగి పుట్టించలేకపోతున్నాం.మరి ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.

అలాంటి అరుదైన వాటిలో ఈ ఫిషింగ్ క్యాట్ ఒకటి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జంతువైన ఈ క్యాట్ చూడటానికి పిల్లిలాగే ఉంటుంది.కానీ అరుపు వేరేగా ఉంటుంది.సైజు కూడా పిల్లి కంటే పెద్దగా పెరుగుతుంది.అంతేకాదు ఇది పిల్లిలా కాకుండా క్రూరంగా ప్రవర్తిస్తుంది.అందువల్లే ఇది వన్య మృగంగా గుర్తింపు పొందింది.

తాజాగా మగ ఫిషింగ్ క్యాట్‌ని బ్రిటన్‌ కార్న్‌వాల్‌లోని న్యూక్వాడీ జూ అధికారులు గ్రాండ్ వెల్‌కం చెప్పారు.దీని పేరు ఓజిల్.ఈ జూలో ఆల్రెడీ ఫ్రెయా అనే ఆడ ఫిషింగ్ క్యాట్ ఉంది.దానికి జోడీగా దీన్ని తెచ్చారు.

ఈ పిల్లులు మన ఇండియాతోపాటూ ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉంటాయి.వీటి సంఖ్య నానాటికీ తగ్గిపోతునే ఉంటాయి.

ఇప్పుడు ఈ జూలో ఈ పిల్లుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.వీటి సంఖ్య తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, చేపలు దొరికే కొలనుల సంఖ్య తగ్గిపోవడం, ఇతర వన్య మృగాలు తినేయడం, వేటగాళ్లు చంపడం వంటి అంశాల వల్ల ఇవి తగ్గిపోతున్నాయి.ఇవి నదులు, కాలువలు, కొలనులు, మాంగ్రూవ్ చెట్లు ఉండే ప్రాంతాల్లో నివసిస్తాయి.

చేపలు తిని బతికే ఈ పిల్లులు దశాబ్ద కాలంగా దాదాపు కనిపించట్లేదు.

Telugu Freya, Animals, Birds, Cat, Northern India, Nuquadi Zoo, Ozil, Southeast

ప్రస్తుతం ఈ పిల్లులు ఆగ్నేయ ఆసియా, ఉత్తర భారత్, శ్రీలంకలో అక్కడక్కడా కనిపిస్తున్నాయి.సాధారణ పిల్లి కంటే ఇవి డబుల్ సైజు పెరగగలవు.అలాగని చిరుతపులి, పులి అంత సైజు మాత్రం పెరగవు.

ఇవి కప్పలు, పాములు, పక్షులు తిని బతుకుతాయి.అలాగే పెద్ద జంతువులు తిని వదిలేసిన మాంసాన్ని ఇవి తింటాయి.

జనరల్‌గా బెంగాల్ రాష్ట్ర జంతువు అనగానే చాలా మంది పెద్ద పులి అనుకుంటారు.పెద్ద పులి మన జాతీయ జంతువు.

అందుకే బెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్ర జంతువుగా ఈ ఫిషింగ్ క్యాట్‌ని ఎంచుకుంది.ఇండియాలో కూడా ఈ జంతువులు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి.

చాలా స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులూ… వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇవి బతకాలంటే తడిగా ఉండే నేలలు అవసరం.

అలాంటి నేలల నానాటికీ తగ్గిపోతుంటే వీటి సంఖ్య కూడా తగ్గిపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube