అమెరికాలోని ‘స్టాన్‌వే టవర్’ నివాసానికి సిద్ధమైంది.ఈ టవర్ మాన్‌హట్టన్‌లో ఉంది.
ఇది నివాసితుల కోసం సిద్ధమైన తరుణంలో ప్రపంచవ్యాప్తంగా హెడ్ లైన్స్‌లో నిలిచింది.ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యం ‘స్టాన్‌వే టవర్’ అని ప్రచారం జరుగుతోంది.
ఈ అందమైన భవనానికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎవరినైనా ఆకట్టుకునేలా ఈ చిత్రాలు ఉన్నాయి.
ఈ మాన్‌హాటన్ టవర్ 1,428 అడుగుల ఎత్తు, 84 అంతస్తులను కలిగి ఉంది.ఈ 84 అంతస్తుల అందమైన ‘స్టాన్‌వే టవర్’లో మొత్తం 60 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం, టవర్‌లోని అపార్ట్‌మెంట్ల ధరలు రూ.58 కోట్ల నుండి 330 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి.ఈ భవనానికి సంబంధించిన ఫొటోలు చూసినప్పుడు, మీరు మీ కళ్ళు తిప్పుకోలేరు.వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎత్తు 1,776 అడుగులు.సెంట్రల్ పార్క్ టవర్ ఎత్తు 1,550 అడుగులు.అయితే ఈ నూతన బిల్డింగ్ సన్నని టవర్‌తో పాటు ఇది అత్యధిక ఎత్తును కలిగి ఉంటుంది.
USAలోని మాన్‌హట్టన్‌లో ఉన్న స్టాన్‌వే టవర్‌ను 11 వెస్ట్ 57వ వీధి అని కూడా పిలుస్తారు.స్టాన్‌వే టవర్ అని పేరు పెట్టిన ఈ భవనం 1925లో స్టాన్‌వే హాల్‌గా నిర్మితమయ్యింది.కానీ 2021 సంవత్సరంలో ఈ భవనంలో రూ.15,000 కోట్లతో రెసిడెన్షియల్ టవర్‌ను నిర్మించారు.

దాని నిర్మాణ తీరుతెన్నుల కారణంగా ఈ టవర్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మిగిలింది.ఈ టవర్‌ను న్యూయార్క్ ఆర్కిటెక్చర్ సంస్థ SOP ఆర్కిటెక్ట్స్ రూపొందించింది.దీనిని JDS డెవలప్‌మెంట్, ప్రాపర్టీ మార్కెట్స్ గ్రూప్, స్ప్రూస్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ సంయుక్తంగా నిర్మించారు.అమెరికాలో ఉన్న స్టాన్‌వే టవర్‌ను నిర్మించడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది.
దీని నిర్మాణాన్ని 2013లో ప్రారంభించారు.







