స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లోను వాట్సాప్ అనేది తప్పకుండా ఉండే యాప్ అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.అలాగే వాట్సాప్ కూడా తన యూజర్లను ఆకట్టుకునే దిశగా రకరకాల ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తుంది.
ఈ క్రమంలోనే మరొక సరి కొత్త ఫీచర్ ని మన అందరికి పరిచయం చేసేందుకు వాట్సాప్ రెడీ అయినట్లు తెలుస్తుంది.మరి ఆ సరికొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా.?రాబోయే కొద్ది రోజుల్లో వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త డ్రాయింగ్ టూల్స్ ను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉంది.
ఈ ఫీచర్ వాట్సాప్ ఐఓఎస్ బీటా వెర్షన్ ఉపయోగిస్తున్న బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చిందని వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక తెలిపింది.
రాబోయే ఈ ఫీచర్లను వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో గుర్తించింది.వాట్సాప్ ప్రవేశపెట్టే ఆ మూడు కొత్త డ్రాయింగ్ టూల్స్ లో రెండు కొత్త పెన్సిల్స్, ఒక బ్లర్ టూల్ ను ప్రవేశపెట్టనున్నట్లు నివేదిక పేర్కొంది.
ఈ టూల్స్ లి ద్వారా మెసేజ్ సెండ్ చేసినప్పుడు రిసీవర్ చూడకూడదనుకునే ఇమేజ్‌లోని టెక్స్ట్ ను లేదా వస్తువులను ఈ టూల్స్ బ్లర్ చేస్తాయి.కాగా వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ఈ కొత్త ఫీచర్‌ను ఓ స్క్రీన్‌షాట్ ద్వారా బయట పెట్టింది.

ఈ నివేదిక ప్రకారం ఈ కొత్త రకం డ్రాయింగ్ టూల్స్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కూడా కొందరి యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.అలాగే వాట్సాప్ కొత్త మీడియా విజిబిలిటీ ఫీచర్‌ను కూడా అనదుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.అంటే ఈ ఫీచర్ ద్వారా మీ డివైజ్‌లలో డిసప్పియరింగ్ చాట్స్ నుంచి మీడియాను ఆటోమేటిక్‌గా సేవ్ కాకుండా చేస్తుంది.అంటే ఈ ఫీచర్ డిసప్పియరింగ్ చాట్స్ లోని మీడియా ఫైల్స్ ను ఫోన్ గ్యాలరీలో ఆటో-సేవ్ కాకుండా ఆటో డౌన్‌లోడ్ మోడ్ ను డిసేబుల్ చేస్తుంది.
మరికొద్ది రోజుల్లోనే ఈ కొత్త ఫీచర్స్ అందరికి అందుబాటులోకి రానున్నాయి.







