స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో మన అందరికి తెలుసు.అలాగే స్మార్ట్ ఫోన్ వాడకం వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా మొబైల్స్ వాడకం వలన రేడియేషన్ బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి.ఎందుకంటే మొబైల్స్ నుండి రేడియెషన్ కిరణాలు విడుదల చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే.
నిజానికి మొబైల్ ఫోన్ నుంచి రేడియేషన్ తక్కువ స్థాయిలో రిలీజ్ అయితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదు.కానీ రేడియేషన్ లెవెల్స్ అనేవి ఎప్పుడయితే అధిక స్థాయిలో రిలీజ్ అవుతాయో అప్పుడు ఆరోగ్యానికి హానికరం.
ఈ రేడియెషన్స్ లెవెల్స్ ను స్పెసిఫిక్ అబ్జార్బ్షన్ రేషియోవాల్యూలో కొలుస్తారు.అలాగే వాటి వాల్యూను వాట్స్ ఫర్ కిలోగ్రామ్ లో పరిగణిస్తారు.రెగ్యులేటింగ్ స్టాండర్డ్స్ ద్వారా సెట్ చేసిన ఇండియన్ శార్ లిమిట్స్ ప్రకారం శార్ వాల్యూ అనేది 1.66 W/Kg గా నిర్ణయించారు.అంటే మానవ శరీరంలోకి 1.66 వాట్స్ లేదా అంతకన్నా తక్కువ రేడియేషన్ వెళ్తే ఆరోగ్యానికి ఎలాంటి సమస్య వాటిల్లదు.అలా కాకుండా 1.66 వాట్స్ కన్నా ఎక్కువ రెడియేషన్ శరీరంలోకి వెళితే మాత్రం ఆరోగ్యానికి చాలా హానికరం.అందుకే మనం వాడే ఫోన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం కొన్ని బ్రాండెడ్ మొబైల్స్ నుంచి కూడా నార్మల్ లెవెల్ కన్నా చాలా దగ్గరగా రేడియేషన్ విడుదల అవుతోందని బ్యాంక్ లెస్ టైమ్స్ నుంచి ఈ న్యూ రిపోర్ట్ తెలుపుతుంది.ముఖ్యంగా బ్రాండెడ్ మొబైల్స్ కూడా అధిక స్థాయిలో రేడియెషన్స్ విడుదల చేస్తున్నాయి.మరి ఆ బ్రాండెడ్ ఆ స్మార్ట్‌ఫోన్లు ఏవో చూద్దామా.ప్రముఖ బ్రాండెడ్ మొబైల్స్ అయిన మోటరోలా ఎడ్జ్ లో 1.79W/kg రెడీయేషన్ ఉండగా.జెడ్‌టీఈ అక్సాన్ 11 5జీ – 1.56 W/బుజ్జి, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ2 ప్లస్ – 1.41 W/Kg, వన్‌ప్లస్ 6టీ – 1.55 W/Kg, గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ – 1.39 W/Kg, గూగుల్ పిక్సెల్ 4ఏ – 1.37 W/Kg, ఒప్పో రెనో5 5జీ – 1.37 W/kg ల రెడీయేషన్ విడుదల అవుతుంది.పైన తెలిపిన మొబైల్స్ లో మోటరోలా ప్రధమ స్థానంలో ఉంది.
నిజానికి పైన లిస్ట్ లో ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఏవీ కూడా ఇండియాలో అందుబాటులో లేకపోవడం గమనార్హం.కాగా మనం స్మార్ట్‌ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని వాడుతుంటాము కానీ అలా మాట్లాడం సరైన పద్ధతి కాదు.
టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఎంత వీలయితే అంతా మొబైల్స్ ను శరీరానికి దూరంగా ఉంచాలి.కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బ్లూటూత్ హెడ్‌ఫోన్‌ని ఉపయోగించాలి.దీనివల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు.







