నగరంలో డ్రగ్స్ దందా ఘటనలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైతో సమావేశమైయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఆందోళనలకు దిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో దీక్ష చేపట్టి తమ నిరసనను కేంద్రానికి తెలియజేశారు.కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా అదే స్థాయిలో టీఆర్ఎస్‌పై ఎదురుదాడికి దిగుతోంది.
కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని.బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకం పెట్టి మరీ ఇప్పుడు సమస్యను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.
గవర్నర్ ప్రొటోకాల్ వ్యవహారం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ సాక్షాత్తూ గవర్నరే ఢిల్లీ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై చేసిన విమర్శలు హాట్‌టాపిక్‌గా మారాయి.
అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.గవర్నర్ ప్రొటోకాల్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్‌భవన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రభుత్వ పెద్దలు హాజరుకాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యింది.వరి కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం, రైతుల ఖాతాలో జమ చేయాలని, విద్యుత్ చార్జీల పెంపుపై, జీవో 111 ఎత్తివేతపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు.జీవో 111 ఎత్తివేత విషయంలో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు.గవర్నర్‌ను కలిసిన వారిలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, అంజన్ కుమార్ తదితరులు ఉన్నారు.

ధాన్యం మొత్తం తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటన చేసింది.అందుకు వెంటనే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని, మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్‌కు టీపీసీసీ నేతలు వినతి పత్రం సమర్పించనున్నారు.ఈ రోజు ఉదయం కూడా హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ నేతలు సమావేశమై ఆయా అంశాలపై చర్చలు జరిపారు.







