మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య.మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశారు.
తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే కొరటాల శివ మెగా హీరోలతో ఆచార్యగా వస్తున్నాడు.ఈ నెల 29న రిలీజ్ ప్లాన్ చేయగా లేటెస్ట్ గా సినిమా నుండి ట్రైలర్ రిలీజైంది.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ లో డౌట్ రేజ్ అయ్యింది.సినిమా ట్రైలర్ లో సిద్ధ పాత్రని ముందు ఇంట్రడ్యూస్ చేశాడు కొరటాల శివ.
సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ హీరో.చరణ్ సపోర్ట్ రోల్ లా కొద్దిసేపు ఉంటాడని చెప్పుకొచ్చారు.
కానీ ట్రైలర్ చూస్తే మాత్రం చిరుది సపోర్టింగ్ రోల్ చరణ్ దే అసలు రోల్ అన్నట్టు అనిపించింది.కొరటాల శివ కావాలని ట్రైలర్ అలా కట్ చేసి ఉండొచ్చు కానీ మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఆర్.ఆర్.ఆర్ తర్వాత మరోసారి ఆచార్యతో స్పెషల్ ట్రీట్ అందించాలని చూస్తున్నారు.చిరు, చరణ్ ఇద్దరు కలిసి ఫైట్లు, డ్యాన్సులు చేస్తుంటే మెగా ఫ్యాన్స్ కి అంతకన్నా పండుగ మరేదైనా ఉంటుందా చెప్పండి.







