అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర.సంచలనం సృష్టించింది.
యాత్రలో చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు అందించడం జరిగింది.ఈ క్రమంలో ఇటీవల వైసిపి నాయకులు చంద్రబాబుకి దత్త పుత్రుడు అని తనని ఉద్దేశించి కామెంట్ చేయటం పై పవన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
నన్ను కనుక ఇంకోసారి చంద్రబాబునాయుడికి దత్తపుత్రుడు.అని పిలిస్తే మిమ్మల్ని సీబీఐకి దత్తపుత్రులు.
అని పిలవాల్సి వస్తుంది అని మండిపడ్డారు.
సీబీఐ వైసీపీలో కీలక నాయకులను.
చాలా ప్రేమగా తీసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయనీ సెటైర్లు వేశారు.అదేవిధంగా టిడిపికి బీ టీం.అని జనసేన పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.టిడిపికి జనసేనకు సంబంధం లేదని తెలిపారు.ఇంకోసారి…టీడీపీ బీ టీం అని ఇష్టానుసారంగా కామెంట్ చేస్తే మిమ్మల్ని చర్లపల్లి షటిల్ టీం అనాల్సి వస్తుంది.అంటూ అనంతపురం కౌలు రైతుల భరోసా యాత్ర లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.








