టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.
ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ నటన పరంగా అదర గొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.
అయితే ఎన్టీఆర్ నిన్న ఏప్రిల్ 11 నాటికీ తన 25 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు.చిత్రం ఏంటంటే సిల్వర్ స్క్రీన్ పైకి రావడమే ఈయన రాముడి పాత్రతో వచ్చాడు.
ఆయన తాతయ్య నటరత్న ఎన్టీఆర్ సైతం రాముడి పాత్రలతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం పొందాడు.ఈయన స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత పౌరాణిక పాత్రలలో మెరిశాడు.

ఇటీవలే వచ్చిన పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ తో తన పరిధిని మరింత విస్తరించు కున్నాడు.తాజాగా ఎన్టీఆర్ భక్తి మార్గం పట్టినట్టు తెలుస్తుంది.బుధవారం నుండి 21 రోజుల పాటు ఆంజనేయ స్వామి దీక్ష చేపట్ట బోతున్నాడు అని తెలుస్తుంది.ఇలాంటి దీక్షలు ఇప్పటి వరకు రామ్ చరణ్ చాలా నే చేసాడు.
అయితే ఈయన స్నేహం కారణంగానే ఎన్టీఆర్ ఇలాంటి దీక్ష చేపట్టాడని తెలుస్తుంది.

ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.ఈ సినిమా కొరటాల శివ సినిమా పూర్తి అయినా తర్వాత స్టార్ట్ కానుంది.







