సాధారణంగా పెద్ద హీరో సినిమా విడుదలవుతుందంటే తొలిరోజు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే.అయితే మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సన్నాఫ్ ఇండియా సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది.
ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోగా సినిమా విడుదలైన తర్వాత డిజాస్టర్ గా నిలిచింది.తక్కువ నిడివితో తెరకెక్కడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ గా నిలిచింది.
అయితే సన్నాఫ్ ఇండియా సినిమాలో చాలామంది సినీ ప్రముఖులు నటించినా వాళ్ల ముఖాలు చూపించకుండా మాటలు మాత్రమే వినబడేలా చూపించడంతో క్లైమాక్స్ లో మాత్రమే ముఖాలు చూపించడం గురించి విమర్శలు వ్యక్తమయ్యాయి.అయితే ఈ సినిమా కోసం పని చేసిన రచయితలలో ఒకరైన తోటపల్లి సాయినాథ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సన్నాఫ్ ఇండియా మూవీకి తాను డైలాగ్స్ రాశానని ఆయన అన్నారు.
ఈ సినిమాకు కథ రాసింది రత్నబాబు కాగా కథనం రాసింది మోహన్ బాబు అని ఆయన చెప్పారు.
పాతిక రోజులు ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేశామని ఆయన వెల్లడించారు.ఈ సినిమా షూట్ సమయంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సినిమానే ఆపేయాలని అనుకున్నామని ఆయన అన్నారు.
చివరి సీన్ లో మాత్రమే ఈ సినిమాలో పాత్రధారులు కనిపిస్తారని అలా ప్రయోగం చేస్తున్నట్టు ముందుగానే చెపాలని అనుకున్నామని ఆయన వెల్లడించారు.

సినిమాలో ఆర్టిస్టుల ఫేసులు చూపించకపోవడంతో కకృత్తి పడి సినిమాను తక్కువ బడ్జెట్ లో పూర్తి చేశామని అనుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.రిలీజ్ కు ముందే ఈ విషయాన్ని రివీల్ చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.తోటపల్లి సాయినాథ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.







