బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ వార్త ఏదైనా ఉందా అని అంటే అది అలియా భట్, రణబీర్ కపూర్ వెడ్డింగ్ అనే చెప్పాలి.స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆలియా భట్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.
కుర్ర హీరోల నుండి సీనియర్ హీరోల వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అందరితో నటిస్తుంది.తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆలియా.
ఇక చేతిలో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకు పోతుంది.
అలాగే ఇప్పుడు ఈమె పెళ్లి విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈమె బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది.వీరి పెళ్లి ఈ నెలలోనే జరగ బోతుంది అని నెట్టింట టాక్ వినిపిస్తుంది.
వీరి ఫ్యాన్స్ వీరి వివాహం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ జంట ముందుగా 14వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఈ ఏప్రిల్ 15న వీరి వెళ్లి జరగనుందని టాక్ వినిపించింది.

పంజాబీ సంప్రదాయం ప్రకారం 15వ తేదీ అంటే 16 తెల్లవారు జామున 2 నుండి 4 గంటల మధ్య ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఏకంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.ఈ పెళ్లి విషయం బయటకు రాగానే అందరూ కంగారు పడుతున్నారు.

పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుండి భద్రత మీద ద్రుష్టి పెట్టారు.అయితే ఇప్పుడు అదే భద్రత కారణంగా వాయిదా వేస్తున్నట్టు సమాచారం.ఈ పెళ్లి వచ్చే వారానికి వాయిదా పడనుందని, ఏప్రిల్ 20న జరుగుతుందని అంటునాన్రు.మరి ఇదే విషయంపై రణబీర్ తల్లి కూడా మీడియాతో మాట్లాడుతూ తనకు తెలియదని, ఎప్పుడు జరుగుతుందో చూద్దాం అని చెప్పడంతో ఇప్పుడు అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
మరి చూడాలి ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో.







