తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తమిళ సూపర్ స్టార్ నటించిన ప్రతి ఒక్క సినిమా ఈ మధ్య కాలంలో 100 నుండి 200 కోట్ల వసూళ్లు చాలా సింపుల్ గా రాబడుతోంది.
కరోనా సమయంలో కూడా విజయ్ నటించిన సినిమా భారీ వసూళ్లను దక్కించుకొని రియల్ సూపర్ స్టార్ అంటూ విజయ్ కి మరో సారి అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.దిలీప్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో విజయ్ కి జోడిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే నటించింది.
తెలుగులో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేశాడు.ప్రస్తుతం దిల్ రాజు ఒక భారీ సినిమాను విజయ్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా బాగా ఆడాలి అంటే.బాగా బిజినెస్ చేయాలి అంటే ఈ సినిమా కచ్చితంగా మంచిగా రిజిస్టర్ అవ్వాలి.అందుకే ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.విజయ్ సినిమా ప్రమోషన్ కోసం తీసుకురావాలని దిల్రాజు ప్రయత్నించాడు.
కానీ అది సాధ్యం కాలేదు.దర్శకుడు నెలన్స్ దిలీప్ మరియు పూజా హెగ్డే వచ్చారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగాయి.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సినిమాకు సంబంధించిన హడావుడి కనిపిస్తుంది.
తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్న నేపథ్యంలో హంగామా చేస్తున్నారు.

దిల్ రాజు ఎక్కువగా ఖర్చు చేసి ప్రమోషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ప్రమోషన్ తో ఈ సినిమా ఖచ్చితంగా మంచి ఆదరణ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ సినిమా విడుదలైన ఒక్క రోజు తర్వాత కే జి ఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కనుక ఈ సినిమా కి ఆ సినిమా గట్టి పోటీగా నిలబడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ది బెస్ట్ నిలుస్తుంది అనేది చూడాలి.







